యుఐడిఎఐ అధికారులను అరెస్ట్‌ చేయండి! | Arrest Aadhaar authorities, not journalist who exposed data breach: Edward Snowden | Sakshi
Sakshi News home page

యుఐడిఎఐ అధికారులను అరెస్ట్‌ చేయండి!

Published Tue, Jan 9 2018 11:11 AM | Last Updated on Tue, Jan 9 2018 4:35 PM

Arrest Aadhaar authorities, not journalist who exposed data breach: Edward Snowden - Sakshi

అమెరికన్ విజిల్‌ బోయర్‌ ఎడ్వర్డ్ స్నోడెన్ మరోసారి ఆధార్‌ హ్యాకింగ్‌  వివాదంపై స్పందించారు.  ఆధార్‌  డేటా హ్యాకింగ్‌పై సమాచారం అందించిన రిపోర్టర్‌కు మద్దతుగానిలిచిన ఆయన భారత ప్రభుత్వం చర్యలపై అభ్యంతరం వక్తం చేశారు. మంగళవారం ట్విట్టర్‌ ద్వారా స్పందించిన   స్నోడెన్‌ లీకింగ్‌ను బయటపెట్టిన జర్నలిస్టుపై చర్యలుకాదు.. లీకింగ్‌ వ్యవహారం, అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక చేశారు. ఈ అక్రమాలను బయటపెట్టిన జర్నలిస్టుపై విచారణకు బదులుగా, యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ)  అధికారులను శిక్షించాలనిహితవు పలికారు.

నిజానికి ఆధార్ డేటా ఉల్లంఘనను బయటపెట్టిన ఆ జర్నలిస్టుకు అవార్డు దక్కాలి గానీ, విచారణ కాదు అని  ట్వీట్‌ చేశారు. భారత ప్రభుత్వం  నిజంగా న్యాయం  చేయాలనుకుంటే కోట్లాది భారతీయుల గోప్యతను నాశనం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సంస్కరణలను ప్రవేశపెట్టాలన్నారు. దీనికి బాధ్యులైనవారిని  అరెస్ట్‌ చేయాలనుకుంటే.. యుఐడిఎఐ వారిని అరెస్ట్‌ చేయాలని  స్నోడెన్  ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇటీవల ఆధార్‌ డేటా కేవలం రూ.500 లకే   మార్కెట్లో లభ్యమవుతోందన్న వార్తలపై కూడా స్నోడెన్‌  ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement