
లండన్: ఆధార్ అక్రమాలపై యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అధికారులను ముందు అరెస్ట్ చేయాలని ప్రఖ్యాత అమెరికన్ విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ అన్నారు. ఆధార్ వివాదంపై మంగళవారం ఆయన మరోమారు ట్వీటర్ ద్వారా స్పందించారు.
అక్రమాలను బయటపెట్టిన జర్నలిస్టులపై విచారణకు బదులుగా వారికి అవార్డులు ఇవ్వాలని సూచించారు. భారత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కోట్లాది భారతీయుల గోప్యతను బయటపెట్టే విధానాలకు చెక్ పెట్టేలా సంస్కరణలు తీసుకురావాలని సూచించారు. ప్రజల జీవితాలు తమ చేతుల్లో ఉండాలని ప్రభుత్వాలు భావిస్తుంటాయని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని పేర్కొన్నారు. ఆధార్ సమాచారం రూ.500కే లభిస్తోందన్న వార్తలపై ఆయన గతంలో స్పందించిన సంగతి తెలిసిందే.