ఐటీ గ్రిడ్స్.. అధికారుల పాత్రపై సిట్‌ విచారణ! | IT Grids Data Breach SIT Will Enquiry On All Angles | Sakshi
Sakshi News home page

ఐటీ గ్రిడ్స్.. అధికారుల పాత్రపై సిట్‌ విచారణ!

Published Thu, Mar 7 2019 10:07 AM | Last Updated on Thu, Mar 7 2019 3:58 PM

IT Grids Data Breach SIT Will Enquiry On All Angles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరీ కేసుపై ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై చర్చించేందుకు గురువారం సమావేశం కానున్న సిట్‌ కీలక ఆధారాలను సేకరించేందుకు సన్నద్ధమవుతుంది. డేటా చోరీ కేసుకు సంబంధించిన రికార్డులను, ఆధారాలను సైబరాబాద్‌ పోలీసులు సిట్‌కు అందజేయనున్నారు. ఈ వివరాలు తీసుకున్న తర్వాత సిట్‌ ఆధ్వర్యంలో ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఉద్యోగులను అధికారులు విచారించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్స్‌కు అందించడంలో ప్రభుత్వ అధికారుల పాత్రపై సిట్‌ విచారణ మొదలుపెట్టనుంది. (‘ఐటీ గ్రిడ్స్‌’పై సిట్‌)

కాగా, ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌  గురువారం వచ్చే  అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్‌ ఎండీ అశోక్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్‌ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురైదంటూ ఫిర్యాదులు రావడంతో తెలంగాణ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసుపై విచారణ చేపట్టిన తెలంగాణ పోలీసుల, తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ అభిమానులు ఆన్‌లైన్‌లో ఎదురుదాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. (ఇదీ జరుగుతోంది!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement