ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ వోజ్నియాక్ (ఫైల్ ఫోటో)
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్ల డేటాలీక్ దుమారం మరింత ముదురుతోంది. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు, టెక్ దిగ్గజాలు వినియోగదారుల గోప్యతా వివరాలు లీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియన్ ఆక్టన్ డిలీట్ ఫేస్‌బుక్ అంటూ సంచలనానికి తెరతీయగా ఇపుడు ఈ కోవలోకి మరో టెక్ దిగ్గజం చేరారు. ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ వోజ్నియాక్ ఫేస్‌బుక్ ఖాతాను తొలగించి తన నిరసనను ప్రకటించారు.
తాజాగా ఫేస్‌బుక్ స్వయంగా ప్రకటించిన వివరాల ప్రకారం పొలిటికల్ డేటా అనాలసిస్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా యూజర్ల అనుమతి లేకుండా అమెరికాలో దాదాపు 87కోట్లు, ఇండియాలో 5లక్షలకుపైగా యూజర్ల లీక్ అయిందన్నవార్త ప్రకంపనలు రేపింది. ఈ సంక్షోభం నేపథ్యంలో మల్లగుల్లాలుపడుతున్న ఫేస్‌బుక్‌కు ఇపుడు వోజ్నియాక్ రూపంలో మరో షాక్ తగిలింది. ఆపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌ను క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ పై పలు విమర్శలు గుప్పించారు.యూజర్లు అందించిన వ్యక్తిగత వివరాలతో ప్రకటనల ద్వారా భారీ మొత్తంలో డబ్బులు దండుకుంటోందని ఆయన మండిపడ్డారు. యూజర్ల సమాచారం ఆధారంగానే ఈ లాభాలు సాధించింది.కానీ వినియోగదారులకు ఎలాంటి లాభాలు ముట్టలేదంటూ ఆయన విమర్శించారు. యాపిల్ సంస్థ తన ఉత్పత్తుల ద్వారా లాభాలనార్జిస్తోందన్నారు. మరోవైపు గోప్యతా కుంభకోణం, ఇతర దుర్వినియోగాల నేపథ్యంలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ విచారణను ఎదుర్కోనున్నారు. మంగళ, బుధవారాల్లో తన సాక్ష్యాన్ని నమోదు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment