
ఆందోళన చేస్తున్న విద్యార్థులు(ఇన్‌సెట్) ఫేస్‌బుక్‌లో సీఎంకి వ్యతిరేకంగా ఆన్‌లైన్ అభియాన్
దొడ్డబళ్లాపురం : రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మంగళూరు ప్రజలు ఆన్‌లైన్ అభియాన్ ప్రారంభించారు. బడ్జెట్‌లో మంగళూరు తదితర కోస్తా ప్రాంతాలకు తీరని అన్యాయం చేసారనే కోపంతో మంగళూరు వాసులు ఈ ఆన్‌లైన్ అభియాన్ చేస్తున్నారు. కుమారస్వామి నాట్ మై సీఎం అంటూ ఫేస్‌బుక్‌లో అక్కౌంట్‌లు తెరచి మరీ దుమ్మెత్తి పోస్తున్నారు. మత్స్యకారులకు ద్రోహం చేసిన కుమారస్వామి అంటూ గోడలపై రాశారు. సాగర పుత్రుల కడుపు కొడుతున్న సీఏం అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే దక్షిణ కన్నడ జిల్లాలో సీఎంకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment