
విలేకరులతో మాట్లాడుతున్న విష్ణువర్థన్‌రెడ్డి
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటకలో సీఎం ప్రమాణస్వీకార వేదిక సాక్షిగా తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరస్తూ కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజల గొతు కోసిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మకైయారని ఆరోపించారు.
చంద్రబాబు ఇలా చేయడం వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని, సీఎం చంద్రబాబు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రముఖ్య పుణ్యక్షేత్రం తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు, అనుమానాలపై సీబీఐ విచారణ జరిపించాలని, టీటీడీ అంటే టీడీపీ పార్టీ కార్యాలయం కాదని ఎద్ధేవా చేశారు
Comments
Please login to add a commentAdd a comment