
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎస్‌ఈసీ చర్యల వల్ల సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజలను దోచుకునే పార్టీ టీడీపీ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో నిజాం షుగర్ పరిశ్రమను ఎత్తివేయలేదా? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ విషయంలో ప్రజలకు ఆందోళన అవసరం లేదన్నారు. (చదవండి: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..)
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడే హక్కు టీడీపీకి లేదని ఆయన ధ్వజమెత్తారు. కరోనా సమయంలో రాష్ట్రాన్ని వదిలేసి పక్కరాష్ట్రంలో కూర్చొని ట్వీట్లు చేసే వ్యక్తులు బీజేపీ గురించి మాట్లాడటం తగదన్నారు. జూమ్ యాప్‌లో ప్రసంగాలు చేసే పెద్దమనిషి విశాఖ స్టీల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సరిగా తెలుగు చదవటం రాని వ్యక్తి ట్వీట్లు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.(చదవండి: కిడ్నాప్ డ్రామా: నివ్వెరపోయే విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment