
సాక్షి, విజయవాడ : రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుకి చంద్రబాబే కారణమని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు తన కుమారుడు కోసం ధారదత్తం చేసి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని దుయ్యబట్టారు. హైకోర్టును రాయలసీమలో పెట్టాలని కోరినా చంద్రబాబు పట్టించుకోలేదని, తాను చెప్పిందే వేదమనేలా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. అమరావతిలో టీడీపీ నాయకులు నాలుగు వేల ఎకరాల భూములు కొన్నారనే ఆరోపణలపై చంద్రబాబు ఎందుకు నోరు మొదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌పై ఎందుకు మాట్లాడటం లేదని, లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు కొన్న భూములపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.