
సాక్షి, అమరావతి : ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద ఆటలను నిషేంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, రాష్ట్ర క్యాబినెట్‌కు అభినందనలు తెలిపారు. అనేక కుటుంబాలు, పిల్లలు ఈ వ్యసనానికి బానిసై ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రభుత్వం చట్టం చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు. ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడల నిషేధంతో యువతకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. (రమ్మీ, పోకర్‌పై ఏపీ సర్కార్ నిషేధం)