టీడీపీలో ప్రశ్నార్థకంగా మారిన విష్ణువర్దన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో ప్రశ్నార్థకంగా మారిన విష్ణువర్దన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌

Published Thu, May 4 2023 11:16 AM | Last Updated on Thu, May 4 2023 11:16 AM

- - Sakshi

కర్నూలు: రాజకీయంగా కోడుమూరు నియోజకవర్గంలో ఓ వెలుగు వెలిగిన విష్ణువర్దన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. 2014లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి టీడీపీ చేజిక్కించుకోవడంలో కీలకంగా వ్యవహరించిన విష్ణుకు కోడుమూరు నియోజకవర్గంలో ఆ పార్టీ పెద్దపీట వేసింది. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కోట్ల, కేఈ సోదరులకే అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు.

నేరుగా చెప్పకపోయినా విష్ణు పార్టీలో ఉన్నా లేనట్లుగానే అధిష్టానం వ్యవహరిస్తోంది. తాజాగా లోకేష్‌ పాదయాత్రలోనూ కోట్ల ఇచ్చిన రూట్‌ మ్యాప్‌నే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విష్ణు కూడా అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఈనెల 2న యాత్ర కోడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశించగా బొకే అందజేయడంతో విష్ణు పాత్ర ముగిసింది. రెండోరోజు కోడుమూరులో బసచేసిన లోకేష్‌ను విష్ణు ప్రత్యేకంగా కలిసి మాట్లాడి వెళ్లిపోయారు. ప్రత్యక్షంగా ఆయనకు ఎక్కడా ప్రాధాన్యత దక్కకపోవడం టీడీపీలోనే చర్చనీయాంశంగా మారింది. టీడీపీని నమ్ముకుంటే ఏ స్థాయి నాయకులకై నా చివరకు ఇలాంటి అనుభవం తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement