లోకేష్‌.. పోటీ చేసి గెలిచే దమ్ముందా? | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌.. పోటీ చేసి గెలిచే దమ్ముందా?

Published Tue, May 2 2023 9:00 AM | Last Updated on Tue, May 2 2023 9:06 AM

- - Sakshi

కర్నూలు: భూ మాఫియా ఇచ్చిన సొమ్ముతోనే నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆరోపించారు. లోకేష్‌కు దమ్ముంటే ఎమ్మిగనూరులో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. తాను ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లోకేష్‌ ఓడితే రాజకీయ సన్యాసం స్వీకరించాలన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదవడం కాదని వాస్తవాలను తెలుసుకుని లోకేష్‌ మాట్లాడాలన్నారు.

ఎవరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. తన కుటుంబంపై అవాస్తవ ఆరోపణలు చేసి లబ్ధి పొందాలని చూడటం అవివేకమన్నారు. టీడీపీ పని అయిపోయిందని, కేవలం ఉనికిని కాపాడుకొనేందుకే లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారన్నారు. కడిమెట్లలో మాన్యం భూమిని లీజుకు తీసుకొని శిస్తు చెల్లిస్తునన్నారు.

రాజకీయాలకు అనర్హుడైన లోకేష్‌కు టీడీపీని నడిపే శక్తి లేదని, ఆయనకు వ్యక్తిత్వ వికాసం లేదని ఎద్దేవా చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీలోకి రావడం ఖాయమని.. భవిష్యత్తులో లోకేష్‌, చంద్రబాబును రోడ్డున కూర్చోబెట్టే దుస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ బీఆర్‌ బసిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నజీర్‌ అహమ్మద్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement