విలాసాల కోసమే సీఎం కేసీఆర్ సింగపూర్ వెళ్లారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి
మెదక్‌టౌన్: విలాసాల కోసమే సీఎం కేసీఆర్ సింగపూర్ వెళ్లారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మెదక్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్నెట్‌లోనే అన్ని దేశాలు కనిపిస్తున్నాయని, దానిని వదిలేసి సింగపూర్ టూర్ పేరుతో సీఎం కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్నారు. రైతు రుణమాఫీపై కేసీఆర్ హామీఇచ్చి, ఇప్పుడు స్పష్టత ఇవ్వకుండా రైతుల మరణాలకు కారణమవుతున్నారని ఆరోపించారు.
దీంతో సీఎం జిల్లాలోనే రైతులు ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువుతో రైతులు అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ సింగపూర్ వెళ్లడం అవసరమా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను సింగపూర్‌లా చేస్తానని కేసీఆర్ తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ప్రజలు తగినబుద్ధి చెబుతారన్నారు. సీఎం తెలంగాణను అభివృద్ధి చేయకుండా గజ్వేల్ చుట్టూ చక్కర్లు కొట్టడం దురదృష్టకరమన్నారు.