
సాక్షి, విశాఖపట్నం: దేవాలయాలను కూలదోచిన చంద్రబాబుకు రామతీర్థం వచ్చే అర్హత లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఈ మేరకు బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'అధికారంలో ఉండగా చంద్రబాబు 30 దేవాలయాలను పడగొట్టారు. టీడీపీ నేతలు దేవాలయాలు పడగొట్టి బీజేపీపై నెడుతున్నారు. నితిన్ గడ్కరీ చెబితే విజయవాడలో దేవాలయాలు పడగొట్టామంటున్న అచ్చెన్నాయుడు ఆధారాలు చూపించాలి. లేదంటే తన పదవికి రాజీనామా చేయాలి. టీడీపీ పడగొట్టిన దేవాలయాలు పునర్నిర్మించాలని గతంలో బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. దేవాలయాలపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రామతీర్థంలో శ్రీరామనవమి చేయాలంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు' అంటూ ఫైర్ అయ్యారు. చదవండి: (దేవాలయాలు కూల్చి.. శౌచాలయాలు)
బీజీపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా దేవాలయాలను కూల్చిన చంద్రబాబు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. గతంలో కూలదోసిన దేవాలయాలను చంద్రబాబు ఎందుకు పునర్నిర్మాణం చేయలేదు. ఓట్ల కోసం చంద్రబాబు మత రాజీకీయాలు చేస్తున్నారు' అంటూ విష్ణువర్దన్‌రెడ్డి మండిపడ్డారు. చదవండి: ('పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద చర్యకైనా సిద్ధమే')
Comments
Please login to add a commentAdd a comment