
ఎల్లారెడ్డికి కండువా కప్పుతున్న బీవై రామయ్య,మురళీకృష్ణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ డి.విష్ణువర్ధన్‌రెడ్డికి గట్టిషాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు తొలిషాపురం పల్లె ఎల్లారెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కోడుమూరు సమన్వయ కర్త మురళీకృష్ణ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీవై రామయ్య మాట్లాడుతూ.. కోడుమూరు నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీకి కంచుకోట అన్నారు.
గత ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధికంగా 50 వేలకు పైగా మెజార్టీతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా మణిగాంధీ గెలుపొందారన్నారు. ఆయన డబ్బుకు అమ్ముడబోయి టీడీపీలో చేరారని, అయినా పార్టీ క్యాడర్ మాత్రం వైఎస్‌ఆర్‌సీపీలోనే ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ౖ వెఎస్‌ఆర్‌సీపీకి విజయానికి కోడుమూరు నియోజకవర్గమే నాంది పలకునుందని జోస్యం చెప్పారు. గతంలో కంటే మరో పదివేల మెజార్టీ అధికంగా వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో బలంగా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీకి ఎల్లారెడ్డి చేరికతో అదనపు బలం చేకూరిందని సమన్వయ కర్త మురళీకృష్ణ అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసేందుకు తనవంతు సహకారం అందించాలనే కోరికతో వైఎస్‌ఆర్‌సీపీలో చేరినట్లు ఎల్లారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కె.మహబూబ్‌బాషా, పస్పల వెంటరాముడు, ఆర్.కొంతలపాడు శ్రీనివాసరెడ్డి, సీబెళగల్ డి.విక్రమ్‌కుమార్, ఎం.ముల్లా హకున్, బి,తాండ్రపాడు మాజీ వైఎస్‌సర్పంచ్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment