చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేదు | Kanna Lakshmi Narayana Slams Chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేదు

Published Tue, Jan 22 2019 8:02 AM | Last Updated on Tue, Jan 22 2019 8:02 AM

Kanna Lakshmi Narayana Slams Chandrababu naidu - Sakshi

దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న బీజేíపీ రాష్ట్ర అ«ధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ

పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం: దోచుకున్న సొమ్ముతో ఓటుకు రూ.25,000 ఇచ్చి అధికారంలోకి తిరిగి రావాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును సోమవారం రాత్రి దీక్షా శిబిరం వద్ద ఆయన కలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేదన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియని విధంగా బాబు ఉన్నారన్నారు. తాను మారానని , అధికారమిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలను సీఎం చంద్రబాబు నమ్మించి గొంతు కోశారన్నారు.

నమ్మి ఓట్లేసి గెలిపించిన జిల్లా ప్రజలకు సీఎం ద్రోహం చేశారని ఆరోపించారు.  భూకుంభకోణాలు, మట్టి, మైనింగ్‌ కుంభకోణాలతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారన్నారు. రాజధానికి 20 వేల ఎకరాలు సరిపోతాయనుకుంటే, 54 వేల ఎకరాలను రైతుల నుంచి లాక్కుని వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల నుంచి సీఎం కొడుకు వరకు రాబంధుల మాదిరి దోచేసుకుంటున్నారని విమర్శించారు. తక్షణం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావుకు  ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. చంద్రబాబు నిట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని మాణిక్యాలరావు అడుగుతున్నారన్నారు. సీఎం సరిగ్గా ఉంటే గూడెంలో  ఎమ్మెల్యే దీక్ష చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. బీజేíపీ రాష్ట్ర నాయకులు అడపా నాగేంద్ర తదితరులు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement