సాక్షి, అమరావతి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా గుంటూరులో ఆదివారం జరిగిన బీజేపీ ప్రజాచైతన్య సభలో ఆయన మాట్లాడుతూ.. ‘అవినీతి, అక్రమాలతో కోట్ల రూపాయల ప్రజల ఆస్తులను చంద్రబాబు కొల్లగొట్టారు. అలా కూడబెట్టిన సొమ్ముతో నేడు ఓట్లు కొనుక్కునే స్థితికి వచ్చారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు. దొంగలా రాత్రికి రాత్రే విజయవాడకు పరార్ అయ్యారు. చంద్రబాబు నిర్వాకంతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో అద్దెలు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. కనీసం ఉద్యోగలుకు జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా రాష్ట్రాన్ని దిగజార్చారు’ అని మండిపడ్డారు.
పోలవరం నిర్మాణానికి 100 శాతం నిధులు కేంద్రమే ఇస్తోందని తెలిపారు. అనంతపురంలో కియా కార్ల తయారీ పరిశ్రమ రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవే కారణమని కన్నా కొనియాడారు.ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహకరిస్తోందని వెల్లడించారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభం ఉందని చెప్పుకునే చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధిలో ఎందుకు చూపించడంలేదని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు దమ్ముంటే అభివృద్ధి అంటే ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రైతులకు రూ.6 వేల ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించారని గుర్తు చేశారు. మోదీ ఆధ్వర్యంలో దేశం ముందుకెళ్తోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment