కన్నా... నీ బతుకు ఏంటో తెలుసుకో.. | - | Sakshi
Sakshi News home page

కన్నా... నీ బతుకు ఏంటో తెలుసుకో..

Published Sat, May 27 2023 11:30 AM | Last Updated on Sat, May 27 2023 12:12 PM

- - Sakshi

మాచర్ల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పుణ్యాన మంత్రివై రాజకీయ జీవితాన్ని పెంపొందించుకున్న నువ్వు ఈ రోజు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నావ్‌..పార్టీలు మారగానే స్థాయి మరచిపోయి వ్యవహరిస్తున్నావు... నీకు ప్రజలు బుద్ధి చెబుతారు... వైఎస్‌ కుటుంబం గురించి మాట్లాడితే తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని గుర్తుంచుకో.. కన్నా అని పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మాచర్లలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన గురించి మాట్లాడుతూ రాక్షస పాలన అని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిలో సుమారు 51 వేల మందికి ఇళ్ల పట్టాలు, 5 వేల మందికి టిడ్కో ఇళ్లు ఇవ్వటంపై జీర్ణించుకోలేక కన్నా లక్ష్మీనారాయణ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. రాజధానిలో పేదలకే ఇవ్వకూడదన్నట్లు మాట్లాడటం దారుణంగా ఉందన్నారు. మంత్రిగా పనిచేసిన నీకు రాజకీయ బిక్ష పెట్టిన రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని మరచిపోయి అధికారం కావాలని తపనతో మూడు పార్టీలు మారిన నువ్వా జగన్‌ గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. ఎట్లాబడితే అట్లా మాట్లాడుతున్నావు. మీకు బినామి ఆస్తులున్న అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదా వారు ఏం పాపం చేశారు.

పేదలకు ఇళ్ల స్థలాలిస్తే అది రాక్షస పాలన అవుతుందా? రాజకీయమంటే పేదలకు ఇళ్లు ఇవ్వటమా? ఇదేనా నువ్వు నేర్చుకున్న రాజకీయం అని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను పీఆర్కే ప్రశ్నించారు. మరోసారి రాజశేఖర్‌రెడ్డి, సీఎం జగన్‌ గురించి మాట్లాడితే పల్నాడులో తిరగవు. గుర్తుంచుకో.. నువ్వు టీడీపీలో చేరగానే అది మంచి పార్టీ అయిందా? రంగాను హత్య చేసినప్పుడు నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడింది గుర్తుందా? ఇయ్యాల వాళ్లు దేవుళ్లు.. సీఎం జగన్‌ రాక్షసుడా దయ్యాలు వేదాలు వల్లించినంటుంది. నువ్వు మాట్లాడే తీరు. ఇప్పటికే నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. సీటు ఎక్కడొస్తుందో తెలియని నువ్వు చంద్రబాబు మెప్పు కోసం విమర్శలు చేస్తే సహించేది లేదంటూ పీఆర్కే ఘాటుగా హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement