
పల్నాడు: వైఎస్సార్‌సీపీ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి. అనిల్‌కుమార్ యాదవ్‌కు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బుధవారం నెల్లూరు నుంచి వందలాది కార్లతో ర్యాలీగా తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చారు.
జిల్లా కేంద్రమైన నరసరావుపేట నియోజకవర్గానికి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చిన ఆయనకు కోటప్పకొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆహ్వానం పలికారు.
త్రికోటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెట్లూరివారిపాలెం గ్రామం చేరుకున్న వారికి ఎంపీపీ మోరబోయిన శ్రీనివాసరావు నాయకత్వంలో పార్టీ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికారు. వందలాది మంది మహిళలు, నాయకులు, కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. కారు దిగి కార్యకర్తలకు కరచాలనం చేశారు.
గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగత వైఎస్సార్, గ్రామ నాయకుడు దివంగత కటికినేని వెంకటరమణ సుబ్బారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుంచి అడుగడుగునా ప్రజల నీరాజనాల మధ్య వందలాదిమంది నాయకులు, కార్యకర్తలు కార్లు, ద్విచక్రవాహనాల ర్యాలీతో తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట పట్టణానికి చేరుకున్నారు. చిలకలూరిపేట సమన్వయకర్త మల్లెల రాజేష్‌నాయుడు పాల్గొన్నారు.
ఇవి చదవండి: జగనన్న హామీలన్నీ నెరవేర్చారు.. : ఎంపీ అవినాష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment