గుంటూరు: సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కండువా రాజకీయాలు చేస్తున్నారు. తమ బలం పెరిగినట్లు చూపించుకునేందుకు వైఎస్సార్ సీపీ నాయకులకు బలవంతంగా కండువాలు కప్పి పార్టీలో చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా పార్టీకి మైలేజీ పెరిగే పరిస్థితి కనపడటం లేదు. చివరికి చంద్రబాబు నాయుడు అరెస్టయినా పార్టీ శ్రేణులనుంచి స్పందన కొరవడింది. ఒకటి, రెండు సామాజిక వర్గాలే భుజాన వేసుకొని తమకు తప్పదన్నట్లు కార్యక్రమం ముందుకు నడిపిస్తున్న తరుణంలో కనీసం వ్యక్తిగత ప్రభావమైనా పెంచుకుందామని బలవంతపు చేరికలు చేర్పిస్తున్నారు.
వైఎస్సార్ సీపీకి చెందిన వారిని టీడీపీలో చేర్చుకుంటూ కండువాలు కప్పుతున్నాడు. గతంలో సత్తెనపల్లి పట్టణంలో టీపాయింట్ వద్ద ఉన్నవారిని మర్యాదగా పిలిచి మెడలో కండవాలు వేసి పత్రికలకు ప్రచారం చేయించుకున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొంటున్నారు ఇది మంచి పద్ధతి కాదని వారు హితవు పలికారు. బలవంతపు చేరికలను తిప్పికొట్టినప్పటికీ మార్పు రాలేదు.
తాజాగా రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తనయుడు జొన్నలగడ్డ సురేష్‌ను స్థానిక నాయకుడు ఒకరు బలవంతంగా తీసుకెళ్లి కన్నా లక్ష్మీనారాయణ దగ్గర కండువా కప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి సురేష్ వైఎస్సార్ సీపీ మండల నాయకులు మర్రి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో కొనసాగుతానన్నారు. పార్టీ బలోపేతం కోసం స్థానిక నాయకులతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.
వ్యక్తిగత ప్రాభవం కోసం పార్టీలోకి బలవంతపు చేరికలు వైఎస్సార్ సీపీలోనే ఉంటామంటున్న నాయకులు
Comments
Please login to add a commentAdd a comment