
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి కులం, మతం రంగు పూయాలని చాలా మంది ప్రయత్నించారన్నారు. కానీ కులమతాలకతీతంగా పార్టీలో చేరికలు జరుగుతున్నాయన్నారు. ఇందిరా గాంధీ టైంలో గరీబీ హఠావో తప్ప ఇంకే పథకం లేదన్నారు.
మోదీ టీ అమ్ముకునే స్థాయి నుంచి వచ్చారని.. బీజేపీలో నాయకులందరూ కింది స్థాయి నుంచి వచ్చారని.. ప్రజల కష్టసుఖాలు బాగా తెలుసని కన్నా పేర్కొన్నారు. దేశంలో ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment