ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో ప్రజల ముందుకు వచ్చి డ్రామా వేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అవకాశవాదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌ను దూషించి ఇప్పుడు చేతులు కలపటం దారుణమని అన్నారు.