
సాక్షి, పశ్చిమగోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా కలక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. కొవ్వూరులో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా కోడూరి లక్ష్మీనారాయణ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయనతో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ అవినీతిని తూర్పారాబట్టారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద డ్రామా కంపెనీల తయారయిందని అన్నారు. లిక్కర్, ఇసుక మాఫియా ఆగడాలకు కొవ్వూరు నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. అడ్డగోలు ఇసుక, మట్టి తవ్వకాలతో పర్యావరణాన్ని కాలరాస్తున్న చంద్రబాబు పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడతాననడం.. దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి టీడీపీ నేతల జేబుల్లోకి నేరుగా తీసుకెళ్లడమే బాబు ఉద్దేశమని కన్నా ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment