కాపులు మంచోళ్లన్న బాబు..కేసులెందుకు??
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ...ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీను ఏపీ ప్రభుత్వం నెరవేర్చలేదు కాబట్టే ఆందోళనకు దిగామని చెప్పారు.
కాపులు మంచి వాళ్లన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేసులెందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ గుర్తు చేసేందుకే తుని సభ నిర్వహించాల్సి వచ్చిందని కన్నా అన్నారు. తునిలో హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.