
నేడు బీజేపీలోకి కన్నా లక్ష్మీనారాయణ
హైదరాబాద్ : మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆయన, తన మద్దతుదారులతో ఈరోజు ఉదయం 10.30 గంటలకు కాషాయ కండువా కప్పుకోనున్నారు. వారం క్రితమే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే.