
మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో ప్రజల ముందుకు వచ్చి డ్రామా వేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అవకాశవాదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌ను దూషించి ఇప్పుడు చేతులు కలపటం దారుణమని అన్నారు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందని గుర్తుచేశారు. టీడీపీ డ్రామా కంపెనీ అని, పార్టీ సిద్ధాంతం అంటూ ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో చంద్రబాబు కన్నా అవినీతిపరుడు మరొకరు లేరని తేల్చిచెప్పారు. ఆపరేషన్ గరుడ అంటూ కొత్త నాటకంతో సినీనటుడు ముందుకు వచ్చాడని పేర్కొన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు ఎవరితోనైనా చేతులు కలుపుతారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment