
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014లో ఏం మాట్లాడాడు.. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవటం, దొంగలందరూ ఒక్కటయ్యారన్న దానికి నిదర్శనంగా పేర్కొన్నారు. టీడీపీ నాయకులు దోచిన అవినీతి సొమ్ము ప్రధాని నరేంద్రమోదీ కక్కిస్తాడనే భయం వారికి పట్టుకుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment