పట్నంబజారు(గుంటూరు), న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రను పరిరక్షించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు.
మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇల్లు ముట్టడి
Oct 9 2013 3:12 AM | Updated on Sep 27 2018 5:59 PM
పట్నంబజారు(గుంటూరు), న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రను పరిరక్షించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. జై సమైక్యాంధ్ర... డౌన్ డౌన్ కన్నా... నినాదాలతో గుంటూరులోని నగరంపాలెం ప్రాంతం దద్దరిల్లింది. తొలుత కలెక్టర్ కార్యాలయం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రదర్శనగా కన్నా నివాసం వద్దకు చేరుకోవడంతో కేంద్ర బలగాలు, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ముళ్ళ కంచెలు అడ్డు వేశారు. ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పలువురు పార్టీ నాయకులకు ముళ్ళ కంచలు గుచ్చుకుని గాయాలయ్యాయి. పోలీసుల తోపులాటలో పార్టీ గుంటూరు తూర్పు నియోకవర్గ నాయకుడు షేక్ మెహమూద్ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అనంతరం నాయకులను అరెస్టు చేసి పట్టాభిపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. నాయకులను స్టేషన్‌కు తరలించకుండా విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాజీనామా చేయమని ఆరు కోట్ల మంది ప్రజలు 70 రోజులుగా కోరుతున్నా కనీసం ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లయినా లేకపోవడం సిగ్గుచేటన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల ముందుకు వెళితే చెప్పులతో కొడతారని హెచ్చరించారు.
పోరాటాల పురిటిగడ్డలో పుట్టిన మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్, కాసు కృష్ణారెడ్డి ఏమాత్రం రోషం ఉన్నా తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీనగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మరిచి పదవుల పట్టుకుని వేలాడుతున్న ప్రజాప్రతినిధులకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం ఐదు జిల్లాల కో ఆర్డినేటర్ డైమండ్‌బాబు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ షౌకత్, ఎండీ నసీర్ అహ్మద్, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త రాతంశెట్టి రామాంజనేయులు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈపూరి అనూప్, మందపాటి శేషగిరిరావు, లీగల్ విభాగం జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, యువజన విభాగం నాయకులు నూనె ఉమమహేశ్వరరెడ్డి, దళిత విభాగం జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, పలు విభాగాల నాయకులు మార్కెట్‌బాబు, సుంకర రామాంజనేయులు, మద్దుల రాజాయాదవ్, యరమాల విజయ్‌కిషోర్, పల్లపు శివ, పానుగంటి చైతన్య, అత్తోట జోసఫ్, శిఖా బెనర్జీ, కారుమూరి అశోక్‌రెడ్డి, పి.రవిశంకర్, కోనూరు సతీష్‌శర్మ, కోటా పిచ్చిరెడ్డి, తోటా ఆంజనేయులు, మహ్మద్ కర్నూమా, కౌశిక్, వనిపెంట వీరారెడ్డి, తనుబుద్ధి కృష్ణారెడ్డి, మేరుగ విజయలక్ష్మి, అనసూయ చౌదరి, సంధాని, అజయ్ యాదవ్, సోమా శేషుబాబు, జూలూరి హేమంగద గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement