కిషోర్‌ను తోసేస్తూ ముందుకు వెళ్తున్న కన్నా, అనుచరులు
నెహ్రూనగర్ (గుంటూరు తూర్పు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహాన్ని ఆధునీకరించి దానికి అంబేడ్కర్ సర్కిల్‌గా నామకరణం చేసి ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని కుల, దళిత సంఘాల నాయకులతో, అన్ని పార్టీ నాయకులను కలుపుకుంటూ శుక్రవారం ఉదయం 9 గంటలకు అధికారికంగా షెడ్యూల్ ప్రకటించారు.
దీనికి సంబంధించి గురువారం సాయంత్రమే సమాచారం అందరికీ చేరవేసింది. అయితే టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ముందే వచ్చి ప్రొటోకాల్‌ను కాదని అంబేడ్కర్ విగ్రహానికి దండ వేస్తానని, తన అనుచరులతో కలిసి విగ్రహం వద్ద దౌర్జనం చేయసాగారు. దీన్ని ఖండిస్తూ దళిత కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి భర్త వైఎస్సార్‌సీపీ నాయకులు బోడపాటి కిషోర్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జునలు ఉదయం 9 గంటలకు అధికారికంగా వచ్చి అంబేడ్కర్ సర్కిల్‌గా నామకరణం చేసి ప్రారంభిస్తారని, ఆ తరువాత దండ వేయాలని సూచించినప్పటికీ దౌర్జన్యంగా తోసుకుంటూ వెళ్లడంతో పాటు దూషిస్తూ, దాడి చేయడానికి యత్నించి భయభ్రాంతులకు గురిచేసి మరి అంబేడ్కర్ విగ్రహానికి దండ వేశారు.
మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి అయి ఉండి కన్నా లక్ష్మీనారాయణ ప్రోటోకాల్ పాటించకుండా దళిత నాయకుడిని తోసేసి, దాడి చేసేందుకు ప్రయత్నించడాన్ని ఖండిస్తూ స్థానిక అరండల్‌పేటలో పోలీస్ స్టేషన్‌లో దళిత, గిరిజన కార్పొరేటర్లు కన్నాపై ఫిర్యాదు చేశారు.
దళిత కార్పొరేటర్ భర్తకు క్షమాపణ చెప్పాలి
దళిత కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి భర్త కిషోర్‌పై టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ విచక్షణ కోల్పోయి దాడికి యత్నించి అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయడం చాలా బాధాకరమైన విషయమని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment