
సాక్షి, గుంటూరు : మంగళగిరి హాయ్‌ల్యాండ్‌లో శనివారం ఏపీ బీజేపీ ముఖ్యనేతల సమావేశం రెండో రోజు జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే సుమారు 75 మంది కీలక నేతల చేరికపై సమావేశంలో చర్చించనునారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ, పురందరేశ్వరి, జీవీఎల్, వి మురళీదరన్, సోము వీర్రాజు, సతీష్ జి, సునీల్ దియోదర్ పాల్గొన్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలు, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. జమిలీ ఎన్నికలు వస్తే సన్నద్దతపై చర్చించారు. నేడు మూడు గంటలకు తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు.