ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ స్కెచ్ గీసింది. ఈ క్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను మళ్లీ తెర మీదకు తెచ్చింది. ఆయన్ని జమ్ము కశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జీగా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. 2014 ఎన్నికల్లో జమ్ము కశ్మీర్‌లో బీజేపీని అధికారంలోకి(సంకీర్ణం) తీసుకురావడంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు.
రామ్ మాధవ్ దాదాపు ఆరేడు సంవత్సరాల పాటు బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అక్కడి రాజకీయాలపై అనుభం ఉన్న రామ్‌మాధవ్‌ను బీజేపీ మళ్లీ రంగంలోకి దించింది.
ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రంకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల ఇన్‌చార్జీగా రామ్‌మాధవ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఇన్‌చార్జీగా రామ్‌మాధవ్ కీయాశీలక రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment