స్టార్ ఆటగాళ్లు, విధ్వంసకర బ్యాటర్లతో నిండిన రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. సొంతగడ్డపై ఇవాళ (మే 5) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్ సేన 9 వికెట్ల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. బ్యాటర్లంతా మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో 17.5 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. గుడ్డి కంటే మెల్ల మేలు అన్న చందంగా సంజూ శాంసన్ (30) ఒక్కడు కాస్త పర్వాలేదనిపించాడు. విధ్వంసకర హిట్టర్లు యశస్వి జైస్వాల్ (14), జోస్ బట్లర్ (8), హెట్‌మైర్ (7)దారుణంగా నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లతో రెచ్చిపోగా, నూర్ అహ్మద్ 2, షమీ, హార్ధిక్, జాషువ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు.
119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 13.5 ఓవర్లలో గిల్ వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు వృద్దిమాన్ సాహా (41 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (36) రాణించగా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్ధిక్ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గిల్ వికెట్ చహల్‌కు దక్కింది.
రియాన్ పరాగ్, దేవ్‌దత్ పడిక్కల్‌లపై ధ్వజమెత్తిన ఫ్యాన్స్..
ఈ మ్యాచ్‌లో ఓటమి అనంతరం రాజస్థాన్ ఫ్యాన్స్ ఇద్దరు ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. 7.75 కోట్ల ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్, 3.8 కోట్లు పోసి కొనుక్కున్న రియాన్ పరాగ్‌లపై అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు వంద రెట్లు నయమని అంటున్నారు. వీరి వల్ల రాజస్థాన్ రాయల్స్ ఇమేజ్ డామేజ్ అయిపోతుందని వాపోతున్నారు.
రానురాను రాజస్థాన్ ఆటగాళ్ల ఆటతీరు ఆర్సీబీ మిడిలార్డర్ కంటే చెండాలంగా తయారవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా రియాన్, పడిక్కల్ మారరని, తక్షణమే వీరిని జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పడిక్కల్‌పై కాస్త కనికరం చూపిస్తున్న అభిమానులు రియాన్ పరాగ్‌ను మాత్రం తూర్పారబెడుతున్నారు. వీడికి ఆట తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ అంటూ బండ బూతులు తిడుతున్నారు. పైగా ఈ మ్యాచ్‌లో ఇతనేదో పొడుస్తాడని ఆర్‌ఆర్ యాజమాన్యం ఇతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించడం సోచనీయమని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, ఇవాల్టి మ్యాచ్‌లో ఓవరాక్షన్ ఆటగాడు రియాన్ పరాగ్ 4 (6), పడిక్కల్ 12 (12) పరుగులు చేశారు. ఈ సీజన్లో పరాగ్ 6 మ్యాచ్‌ల్లో కేవలం 58 పరుగులు మాత్రమే చేస్తే.. పడిక్కల్ 9 మ్యాచ్‌ల్లో 206 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment