IPL 2022 SRH Vs RR: Fans Surprised On Kane Williamson Given Out, Fans Slam Third Umpire - Sakshi
Sakshi News home page

Kane Williamson: వెయ్యిసార్లు చూసినా అదే నిజం.. చెత్త అంపైరింగ్‌! పాపం కేన్‌ మామ!

Published Wed, Mar 30 2022 8:17 AM | Last Updated on Wed, Mar 30 2022 10:12 AM

IPL 2022 SRH Vs RR: Fans Surprised On Kane Williamson Given Out - Sakshi

Photo Courtesy: Disney+ Hotstar/IPL

IPL 2022- Kane Williamson: ఐపీఎల్‌-2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ వికెట్‌ చర్చకు దారి తీసింది. ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో బంతి ఎడ్జ్‌ తీసుకొని కీపర్‌ సామ్సన్‌ వైపు వెళ్లింది. అతడు దానిని వదిలేయగా, బంతి గాల్లోకి లేవడంతో మొదటి స్లిప్‌లోనే ఉన్న పడిక్కల్‌ దానిని అందుకున్నాడు.

అయితే పడిక్కల్‌ క్యాచ్‌ తీసుకునే ముందు బంతి నేలను తాకిందనే అనుమానంతో విలియమ్సన్‌ క్రీజ్‌ నుంచి కదల్లేదు. టీవీ అంపైర్‌ పదే పదే రీప్లేలు చూసినా దానిపై స్పష్టత రాలేదు. కొన్ని యాంగిల్స్‌లో మాత్రం అది నేలను తాకిన తర్వాత పడిక్కల్‌ చేతుల్లో పడినట్లు కనిపించింది.  చివరకు అంపైర్‌ ‘అవుట్‌’గా ప్రకటించడంతో నిరాశగా హైదరాబాద్‌ కెప్టెన్‌ వెనుదిరిగాడు.

దీనిపై నెట్టింట ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ‘‘వెయ్యిసార్లు చూసినా అదే కనిపించేది అదే. అదే నిజం కూడా.. చెత్త అంపైరింగ్‌! పాపం కేన్‌ మామ! అనవసరంగా బలయ్యాడు’’ అంటూ ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement