
Courtesy: IPL Twitter
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ఐపీఎల్‌లో వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పడిక్కల్ ఈ ఫీట్ సాధించాడు. కాగా ఐపీఎల్‌లో వెయ్యి పరుగులను అత్యంత వేగంగా సాధించిన మూడో ఆటగాడిగా పడిక్కల్ రికార్డు సాధించాడు. 35 మ్యాచ్‌ల్లో ఈ మార్క్ అందుకున్న పడిక్కల్ ఖాతాలో ఒక సెంచరీ, ఆరు అర్థసెంచరీలు ఉన్నాయి.
అయితే ఈ సీజన్‌లో పడిక్కల్ బ్యాట్ నుంచి మెరుపులు కనబడడం లేదు. గత సీజన్‌లో ఆర్‌సీబీ తరపున మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన పడిక్కల్ ఈసారి మాత్రం రాజస్తాన్ తరపున ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 41,7,37,29,0 పరుగులు సాధించాడు. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్ 18 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఐపీఎల్‌లో వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకున్న పడిక్కల్‌ను క్రికెట్ ఫ్యాన్స్ అభినందిస్తూనే చురకలు అంటించారు. ''రికార్డుల పరంగా ఓకే.. కానీ ఫామ్‌లోకి వస్తే బాగుంటుంది.. నీ నుంచి పెద్ద స్కోర్లు చూసే భాగ్యం ఉందా లేదా'' అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: Carlos Brathwaite: 2016 టి20 ప్రపంచకప్ హీరోకు వింత అనుభవం..