IPL 2022: Jos Buttler, Devdutt Padikkal Complete 4 Runs by Running Between Wickets - Sakshi
Sakshi News home page

IPL 2022: ‘నాలుగు’ పరుగెత్తారు...! మీరు సూపర్‌!

Published Tue, Apr 19 2022 8:25 AM | Last Updated on Tue, Apr 19 2022 12:10 PM

IPL 2022: Jos Butler Padikkal Complete 4 Runs Running Between Wickets - Sakshi

PC: IPL/Disney+Hotstar

IPL 2022- RR Vs KKR: ఓవర్‌ త్రో లేకుండా నేరుగా వికెట్ల మధ్య పరుగెత్తి నాలుగు రన్స్‌ తీయడం సాధ్యమా! సాధ్యమేనని రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటర్లు జోస్‌ బట్లర్, దేవ్‌దత్‌ పడిక్కల్‌ చేసి చూపించారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ చివరి బంతిని బట్లర్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఆడాడు. బంతిని వెంటాడిన వెంకటేశ్‌ బౌండరీకి చేరువలో దానిని ఆపి వెనక్కి తోయగలిగాడు.

ఇక దానిని అందుకున్న రాణా బంతిని కీపర్‌ వైపు విసిరాడు. అయితే మూడు పరుగులు సునాయాసంగా పూర్తి చేసుకున్న బట్లర్, డైవ్‌తో నాలుగో పరుగు కూడా సాధించడం విశేషం.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో.. ‘‘మీ ఫిట్‌నెస్‌ లెవల్స్‌ సూపర్‌.. పరుగెత్తి నాలుగు పరుగులు సాధించారు.. గ్రేట్‌’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

కాగా సోమవారం రాజస్తాన్‌, కోల్‌కతా మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ బృందం కోల్‌కతాపై విజయం సాధించింది. ఏడు పరుగుల తేడాతో శ్రేయస్‌ సేనను ఓడించి ఐపీఎల్‌-2022లో నాలుగో గెలుపును నమోదు చేసింది. తద్వారా ఎనిమిది పాయంట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

చదవండి: IPL 2022: బట్లర్‌ భళా... చహల్‌ చాంగుభళా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement