ఇరగదీసిన డివిల్లియర్స్‌.. సిక్సర్ల వర్షం.. కానీ సెంచరీ వృథా! | IPL 2021 Phase 2: AB de Villiers Cracks Century RCB Intra Squad Match | Sakshi
Sakshi News home page

IPL 2021 Phase 2: ఇరగదీసిన డివిల్లియర్స్‌.. సిక్సర్ల వర్షం.. కానీ సెంచరీ వృథా!

Published Wed, Sep 15 2021 12:28 PM | Last Updated on Wed, Sep 15 2021 6:55 PM

IPL 2021 Phase 2: AB de Villiers Cracks Century RCB Intra Squad Match - Sakshi

ఏబీ డివిల్లియర్స్‌(ఫొటో కర్టెసీ: ఆర్సీబీ ట్విటర్‌)

AB de Villiers Scores Century Intra Squad Match : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే యూఏఈ చేరుకున్న జట్లు ప్రాక్టీసు మొదలెట్టేశాయి. ఇక ఈసారైనా కప్‌ కొట్టాలన్న ఆశయంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు నెట్స్‌లో గట్టిగానే శ్రమిస్తున్నారు. రెండు జట్లుగా విడిపోయి ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌లతో కావాల్సినంత ప్రాక్టీసు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాటి మ్యాచ్‌లో... ఆర్సీబీ ఏ కెప్టెన్‌ హర్షల్‌ పటేల్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. 

ఈ క్రమంలో పవర్‌ప్లేలో వికెట్‌ కోల్పోయిన ‘ఏ’ జట్టును స్టార్‌ ఆటగాడు ఏబీ డివిల్లియర్స్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌ ఆదుకున్నారు. ఏడో ఓవర్‌ ముగిసేసరికి డివిల్లియర్స్‌ హాఫ్‌ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అదే జోరులో శతకం(46 బంతుల్లో 104 పరుగులుఏడు ఫోర్లు, 10 సిక్సర్లు) కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఏ 212 పరుగులు చేయగలిగింది.

అయితే లక్ష్యఛేదనలో భాగంగా దేవదత్‌ పడిక్కల్‌ సారథ్యంలోని ఆర్సీబీ బీ మెరుగైన ఆట కనబరిచింది. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. బౌండరీ బాది విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మూడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు సాధించి గెలుపొందింది. ఈ టీంలో కేఎస్‌ భరత్‌ 95 పరుగులు సాధించి సత్తా చాటగా.. ఆర్సీబీ ఏ జట్టులోని సెంచరీ చేసిన డివిల్లియర్స్‌ పోరాటం వృథాగా పోయింది. ఈ ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.

చదవండి: IPL 2021 Phase 2: నాలాంటి ‘ఓల్డ్‌ మ్యాన్‌’కు కష్టమే: డివిల్లియర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement