భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్ ఓ అడుగు ముందుకేసి ఇదివరకే తుది జట్టును కూడా ప్రకటించింది. తుది జట్టు విషయంలో టీమిండియానే ఎటూ తేల్చుకోలేకపోతుంది.
మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో నాలుగో టెస్ట్‌కు అర్హత కోల్పోయాడు. రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా రెండు, మూడు టెస్ట్‌లు ఆడిన రజత్ పాటిదార్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ ఒక్క స్థానంపై టీమిండియా మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. పాటిదార్‌కు మరో అవకాశం ఇవ్వాలా లేక దేవ్‌దత్ పడిక్కల్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్ ఇవ్వాలా అని మేనేజ్‌మెంట్ జట్టు పీక్కుంటుంది.
తాజాగా ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ నోరు విప్పాడు. పాటిదార్ మంచి ప్లేయర్ అని, ఒకటి రెండు వైఫల్యాలకే ఏ ఆటగాడి నైపుణ్యాన్ని శంకించకూడదని పరోక్షంగా పాటిదార్‌ను వెనకేసుకొచ్చాడు. రాథోడ్‌కు పాటిదార్‌పై సదుద్దేశమే ఉన్నప్పటికీ టీమిండియా అభిమానులు మాత్రం దేవ్‌దత్ పడిక్కల్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పడిక్కల్ ఇటీవలికాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, పాటిదార్‌తో పోలిస్తే పడిక్కల్ చాలా బెటర్ అని వారభిప్రాయపడుతున్నారు. మరి నాలుగో స్థానంపై టీమిండియా మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి కొన్ని గంటలు వేచి చూస్తే కాని తెలీదు. మరోవైపు బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ఆకాశ్‌దీప్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. రేపటి మ్యాచ్‌లో ఆకాశ్ అరంగేట్రం చేయడం ఖాయమని అంతా అనుకుంటున్నారు.
నాలుగో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్/దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్‌దీప్
Comments
Please login to add a commentAdd a comment