భారత ‘డి’ బ్యాటర్ సెంచరీ మిస్
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ‘డి’ 183 ఆలౌట్
భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 115/1
సాక్షి అనంతపురం: ఓపెనర్లు ప్రథమ్ సింగ్ (82 బంతుల్లో 59 బ్యాటింగ్), కెపె్టన్ మయాంక్ అగర్వాల్ (87 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధ శతకాలు బాదడంతో భారత్ ‘డి’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 28.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఆరంభం నుంచి సాధికారికంగా ఆడిన ఈ జంట తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగియడానికి ముందు భారత్ ‘డి’ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్‌లో మయాంక్ ఔటయ్యాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 288/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ మరో రెండు పరుగులు జోడించి 290 వద్ద ఆలౌటైంది. షమ్స్ ములానీ (187 బంతుల్లో 89; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రితం రోజు స్కోరుకు ఒక పరుగు మాత్రమే జత చేయగలిగాడు.
భారత్ ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా 4... విద్వత్ కావేరప్ప, అర్‡్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ‘డి’ 52.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ (124 బంతుల్లో 92; 15 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత్ ‘ఎ’ జట్టు బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అఖీబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ ‘ఎ’... రెండో ఇన్నింగ్స్ స్కోరుతో కలుపుకొని ఓవరాల్‌గా 222 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్న భారత్ ‘ఎ’ మూడో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి.
పడిక్కల్ ఒక్కడే...
భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఒక్కడే ఆకట్టుకున్నాడు. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (0) డకౌట్ కాగా.. వికెట్ కీపర్ సంజూ సామ్సన్ (5), అథర్వ (4), యశ్ దూబే (14), రికీ భుయ్ (23), సారాంశ్ జైన్ (8), విఫలమయ్యారు. ఒక ఎండ్‌లో పడిక్కల్ క్రీజులో పాతుకుపోగా... మరో ఎండ్ నుంచి అతడికి సహకారం అందించేవారే కరువయ్యారు. సహచరులతో ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా... పడిక్కల్ మాత్రం జోరు తగ్గించలేదు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సామ్సన్ మరోసారి అంచనాలు అందుకోలేకపోగా... మెరుగైన ఆరంభం దక్కించుకున్న ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్... ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో హర్షిత్ రాణా (29 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ ‘డి’183 పరుగులు చేయగలిగింది.
స్కోరు వివరాలు
భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 288 ఆలౌట్; భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్ 4; యశ్ దూబే (సి) కుశాగ్ర (బి) అఖీబ్ 14; శ్రేయస్ (సి) అఖీబ్ (బి) ఖలీల్ 0; పడిక్కల్ (సి) కుశాగ్ర (బి) ప్రసిధ్ కృష్ణ 92; సంజూ సామ్సన్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) అఖీబ్ 5; రికీ భుయ్ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్ 23; సారాంశ్ (ఎల్బీ) తనుశ్ 8; సౌరభ్ (సి) శాశ్వత్ (బి) అఖీబ్ 1; హర్షిత్ రాణా (బి) ములానీ 31; అర్‡్షదీప్ (రనౌట్) 0; విద్వత్ కావేరప్ప (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: (52.1 ఓవర్లలో ఆలౌట్) 183. వికెట్ల పతనం: 1–4, 2–6, 3–44, 4–52, 5–96, 6–122, 7–141, 8–154, 9–170, 10–183. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 8–0–39–3; ప్రసిధ్ కృష్ణ 11–4–30–1; అఖీబ్ ఖాన్ 12–2–41–3; తనుశ్ కొటియాన్ 12–5–22–1; షమ్స్ ములానీ 9.1–1–50–1.
భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (బ్యాటింగ్) 59; మయాంక్ అగర్వాల్ (సి అండ్ బి) శ్రేయస్ అయ్యర్ 56; మొత్తం: (28.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 115. వికెట్ల పతనం: 1–115, బౌలింగ్: హర్షిత్ రాణా 3–0–12–0; విద్వత్ కావేరప్ప 3–0–18–0; సౌరభ్ కుమార్ 11–1–46–0; అర్‡్షదీప్ సింగ్ 4–0–21–0; సారాంశ్ జైన్ 7–1–18–0; శ్రేయస్ అయ్యర్ 0.1–0–0–1.
Comments
Please login to add a commentAdd a comment