
ఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికే ముందు ఆటగాళ్లు కరోనా బారిన పడడం ఆయా జట్ల ఫ్రాంచైజీలను కలవరపరుస్తుంది. లీగ్ ప్రారంభం కాకముందే ఆటగాళ్లు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆర్‌సీబీ ఆటగాడు దేవదత్ పడిక్కల్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం పడిక్కల్ ఐసోలేషన్ కేంద్రానికి పంపించినట్లు ఆర్‌సీబీ యాజమాన్యం తెలిపింది. కాగా గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో దేవదత్ పడిక్కల్ ఆర్‌సీబీ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 15 మ్యాచ్‌ల్లో 473 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
కాగా ఇప్పటికే కేకేఆర్ నుంచి నితీష్ రాణా, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అక్షర్ పటేల్ కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో క్వారంటైన్‌కు పంపించారు. మరోవైపు సీఎస్‌కే శిబిరంలో కూడా కరోనా కలకలం రేపింది. సీఎస్‌కే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతను పూర్తి ఐసోలేషన్‌లో ఉన్నాడు. కాగా, జట్టులోని సభ్యులు కానీ, కోచింగ్ స్టాఫ్‌కు కానీ ప్లేయర్స్ కానీ కరోనా రాకపోవడంతో సీఎస్‌కే యాజమాన్యం కాస్త ఊపిరి పీల్చుకుంది.
చదవండి: సీఎస్‌కే శిబిరంలో కరోనా కలకలం
Comments
Please login to add a commentAdd a comment