IPL 2023 SRH Vs RR: Umran Malik Rattles Devdutt Padikkal Stumps, Video Goes Viral - Sakshi
Sakshi News home page

SRH Vs RR: ఇదొక్కటి! బ్యాటర్‌కు దిమ్మతిరిగింది.. ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో!

Published Mon, Apr 3 2023 12:57 PM | Last Updated on Mon, Apr 3 2023 2:23 PM

IPL 2023 SRH Vs RR Umran Malik Rattles Devdutt Padikkal Stumps Video Viral - Sakshi

ఉమ్రాన్‌ దెబ్బకు పడిక్కల్‌ బౌల్డ్‌ (Photo Credit: IPL Twitter)

IPL 2023- Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఐపీఎల్‌-2023లో తొలి మ్యాచ్‌లోనే అత్యంత పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. సొంత మైదానంలో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తూ రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో చిత్తుగా ఓడింది. ఉప్పల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 72 పరుగులతో తేడాతో ఓటమిపాలైంది.

అయితే, ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటర్ల మెరుపులు పెద్దగా లేకపోయినా.. రైజర్స్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ మాత్రం అదరగొట్టాడు. ఈ టీమిండియా స్పీడ్‌స్టర్‌ మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసి 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. రాజస్తాన్‌ బ్యాటర్లు దేవ్‌దత్‌ పడిక్కల్‌(2)ను అద్భుత డెలివరీతో బౌల్డ్‌ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పదిహేనో ఓవర్లో సుమారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించిన ఉమ్రాన్‌ దెబ్బకు వికెట్‌ ఎగిరి పడింది.

దీంతో బ్యాటర్‌ పడిక్కల్‌ విస్మయానికి లోనుకగా.. ఉమ్రాన్‌ ముఖంలో చిరునవ్వులు విరబూశాయి. ఇక బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించిన ఉమ్రాన్‌.. ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 8 బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్సర్ల సాయంతో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. రైజర్స్‌ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఐపీఎల్‌-2023 సన్‌రైజర్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ మ్యాచ్‌ స్కోర్లు:
టాస్‌: సన్‌రైజర్స్‌- బౌలింగ్‌
రాజస్తాన్‌ రాయల్స్‌- 203/5 (20)
ఎస్‌ఆర్‌హెచ్‌- 131/8 (20)
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జోస్‌ బట్లర్‌(22 బంతుల్లో 54 పరుగులు)

చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక..
మార్కరమ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. సౌతాఫ్రికాకు ప్రపంచకప్‌ బెర్తు ఖరారు! ఒక్కడివే 175 కొట్టావు.. కానీ ఇక్కడ అంతా కలిసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement