అభిమన్యు ఈశ్వరన్ (PC: PTI)
BCCI- India ‘A’ squad: ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్‌కు ముందు.. వామప్ మ్యాచ్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత్-‘ఏ’ జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడేందుకు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది.
మెన్స్ సెలక్షన్ కమిటీ సెలక్ట్ చేసిన ఈ టీమ్‌కు బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ శనివారం వెల్లడించింది. ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్-‘ఏ’ జట్టు మొత్తం రెండు వామప్ మ్యాచ్‌లు ఆడుతుందని తెలిపింది.
అదే విధంగా... జనవరి 12- 20 మధ్య ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు.. ఇంగ్లండ్ లయన్స్ భారత్-‘ఏ’ జట్టుతో ఈ మేరకు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది.
ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత్-‘ఏ’ జట్టు
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోష్ రంజన్ పాల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, పుల్కిత్ నారంగ్, నవదీప్ సైనీ, తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్.
ఇంగ్లండ్ లయన్స్‌తో ఇండియా-‘ఏ’ జట్టు వామప్ మ్యాచ్‌ల షెడ్యూల్
1. జనవరి 12-13: నరేంద్ర మోదీ స్టేడియం గ్రౌండ్- బి, అహ్మదాబాద్(రెండు రోజుల మ్యాచ్)
2. జనవరి 17-20: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్(నాలుగు రోజుల మ్యాచ్).
చదవండి: T20 WC 2024: అద్భుతమైన ఫీల్డర్లు.. కోహ్లి, రోహిత్‌లను ఆడించాలి: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment