Indv Vs Eng Test Series: 4, 12, 0, 26, 31, 6, 0, 4*, 35, 13, 27, 29... టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టెస్టు క్రికెట్‌లో పునరాగమనం చేసిన తర్వాత అతడు నమోదు చేసిన స్కోర్లు ఇవి. బంగ్లాదేశ్‌తో 2022లో మ్యాచ్ సందర్భంగా అతడు రెండు ఇన్నింగ్స్‌లో చేసిన స్కోర్లు 87, 29*.
ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ కనీసం ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేదు అయ్యర్. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రంజీల్లో ఆడాల్సిందిగా అయ్యర్‌ను ఆదేశించింది టీమిండియా మేనేజ్‌మెంట్.
రంజీలో ఆడిన తర్వాతే
ఈ నేపథ్యంలో ఇటీవల రంజీ ట్రోఫీ-2024లో భాగంగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు ఈ ముంబై బ్యాటర్. 48 పరుగులు చేయడంతో పాటు.. 145కు పైగా ఓవర్లపాటు ఫీల్డింగ్ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లే కనిపించాడు.
కానీ.. మైదానంలో దిగిన తర్వాత ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తొలి రెండు టెస్టుల్లో కలిపి కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
మిగిలిన మూడు టెస్టుల్లో అతడిని ఆడించవద్దని.. తిరిగి రంజీ బరిలో దించాలని మాజీ క్రికెటర్లు బీసీసీఐకి సూచించారు కూడా! ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన జట్టులో అయ్యర్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.
గాయమా? నో ఛాన్స్
ఈ నేపథ్యంలో.. వెన్నునొప్పి కారణంగా అయ్యర్ సెలక్షన్‌కు అందుబాటులో లేడనే వార్తలు వట్టి వదంతులే అని తేలిపోయాయి. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు క్రిక్‌నెక్ట్స్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
‘‘గాయమా? అవకాశమే లేదు.. బెన్ స్టోక్స్‌ను అయ్యర్ రనౌట్ చేసిన విధానం చూశారు కదా! అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అయితే, మిడిలార్డర్ బ్యాటర్‌గా జట్టుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు.
కారణం చెప్పని బీసీసీఐ
మేనేజ్‌మెంట్ అతడు పరుగులు చేయాలని కోరుకుంటోంది. కానీ అలా జరగడం లేదు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే బీసీసీఐ తాజాగా జట్టును ప్రకటించిన సందర్భంలో విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్‌ల గురించి ప్రస్తావించిందే తప్ప అయ్యర్ దూరం కావడానికి గల కారణం చెప్పలేదు.
ఈ నేపథ్యంలో.. వరుస వైఫల్యాల కారణంగానే శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేశారని.. ఇప్పట్లో అతడు రీ ఎంట్రీ ఇవ్వడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా సర్ఫరాజ్ ఖాన్ వంటి వాళ్లకు తుదిజట్టులో అవకాశాలు ఇస్తే బాగుంటుందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు.
చదవండి: IND vs ENG: ఎన్నో బాధలు.. ఎన్నో కష్టాలు! కట్‌చేస్తే ఇప్పుడు టీమిండియాలోకి ఎంట్రీ?
Comments
Please login to add a commentAdd a comment