ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్-ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆసీస్-ఎ జట్టుతో భారత్ రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు పంపే జట్టును సెలక్టర్లు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన భారత్-ఎ జట్టుకు స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నట్లు సమాచారం.
రుతురాజ్ ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌లో తను ఏంటో నిరూపించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మహారాష్ట్రకు గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి భారత-ఎ జట్టు పగ్గాలు అప్పగించనున్నట్లు వినికిడి.
కిషన్‌కు చోటు?
అదేవిధంగా ఆసీస్ టూర్‌కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత సీనియర్ జట్టులో చోటు కోల్పోయిన కిషన్.. ప్రస్తుతం రంజీల్లో జార్ఖండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఈ టోర్నీలో కిషన్ పర్వాలేదన్పిస్తున్నాడు. అంతకముందు దులీప్ ట్రోఫీలో కూడా ఇషాన్ సత్తాచాటాడు. ఈ క్రమంలో అతడిని ఆస్ట్రేలియాకు పంపనున్నట్లు సమాచారం. ఇక ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టులో ఆంధ్రా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రికీ భుయ్ కూడా చోటు సంపాదించుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఆసీస్ టూర్‌కు భారత్- ఎ జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్,సాయి సుదర్శన్, బి ఇంద్రజిత్, అభిషేక్ పోరెల్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, రికీ భుయ్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవ్‌దీప్ సైనీ, ఖాలీల్ అహ్మద్, తనుష్ కోటియన్, యశ్ దయాళ్
చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment