
పుజారా ట్రిపుల్ సెంచరీ
సౌరాష్ట్ర బ్యాట్స్మన్ చటేశ్వర్ పుజారా కెరీర్లో రెండో ఫస్ట్క్లాస్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్-ఎతో మూడో అనధికారిక టెస్టులో భారత్-ఎకు సారథ్యం వహిస్తున్న పుజారా (306 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్తో విజృంభించాడు. పది గంటలపాటు క్రీజులో నిలిచి మొత్తం ౩౩ ఫోర్లు బాదాడు. గతంలో కర్ణాటకతో పుజారా (352) ట్రిపుల్ సెంచరీ బాదాడు.
తాజా సిరీస్లో మ్యాచ్ మూడో రోజు శుక్రవారం భారత్ 546/9 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో పుజారా సేన 296 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం విండీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్లో 268 పరుగులకు ఆలౌటైంది.