IND U-19 Vs AUS U-19 Test Series: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత జట్టు.. ఆస్ట్రేలియాతో అండర్-19 అనధికారిక టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. చెన్నై వేదికగా తొలి టెస్టులో యువ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా సొంతగడ్డపై జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది.
కాగా ఓవర్‌నైట్ స్కోరు 110/4తో బుధవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా అండర్–19 జట్టు 67.4 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. రిలీ కింగ్‌సెల్ (48; 7 ఫోర్లు, ఒక సిక్స్) ఆసీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్ కాగా... ఎయిడెన్ ఓ కానర్ (38 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. ఇక యువ భారత బౌలర్లలో లెగ్‌స్పిన్నర్ మహమ్మద్ ఇనాన్ ఆరు వికెట్లతో చెలరేగాడు.
మరోవైపు.. కెప్టెన్ సొహమ్ పట్వర్ధన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువభారత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 61.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి జయభేరి మోగించింది.
అయితే, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ (1) విఫలం కాగా.. నిత్య పాండ్యా (86 బంతుల్లో 51; 3 ఫోర్లు), నిఖిల్ కుమార్ (71 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. ఛేజింగ్‌లో ఒత్తిడి పెరిగిపోతున్న సమయంలో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన నిఖిల్ కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో ఎయిడెన్ ఓ కానర్ నాలుగు, విశ్వ రామ్‌కుమార్ మూడు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి రెండో అనధికారిక టెస్టు మొదలు కానుంది.
చదవండి: ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్
Comments
Please login to add a commentAdd a comment