Abhimanyu
-
ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ కొడుకు ఇప్పుడు హీరో.. ఎలా ఉన్నాడో తెలుసా? (ఫొటోలు)
-
Ind A Vs Ban A: 6 వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా స్కోరెంతంటే!
Bangladesh A vs India A, 2nd unofficial Test - సిల్హెట్: బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ అదరగొట్టాడు. మంగళవారం మొదలైన రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్లతో (6/40) చెలరేగాడు. ఫలితంగా బంగ్లాదేశ్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 80.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కాగా ముకేశ్ కెరీర్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. ఇక ఇతర భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్‌లకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. ఆతిథ్య బంగ్లా జట్టులో షాహదత్ హుస్సేన్ (80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), జకీర్ అలీ (62; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 3, యశస్వి జైశ్వాల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా రెండు అనధికారిక టెస్టులు ఆడే నిమిత్తం భారత- ‘ఎ’ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కాక్స్ బజార్లో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. చదవండి: FIFA WC Pre- Quarterfinals: స్పెయిన్‌కు షాక్.. మొరాకో సంచలనం! బోనో వల్లే ఇదంతా! IND Vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే? -
యశస్వి, అభిమన్యు సెంచరీలు వృథా.. బంగ్లాతో తొలి టెస్టు డ్రా
India A tour of Bangladesh, 2022 - Bangladesh A vs India A, 1st unofficial Test: భారత-‘ఎ’ జట్టుతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ పరాజయం నుంచి తప్పించుకుంది. ఓపెనర్ బ్యాటర్ జకీర్ హసన్, వన్‌డౌన్ బ్యాటర్ నజ్ముల్ హొసేన్ షాంటో పర్యాటక జట్టు చేతిలో ఓటమి నుంచి బంగ్లాను కాపాడారు. వీరిద్దరి ప్రదర్శన కారణంగా కాక్స్ బజార్ వేదికగా జరిగిన నాలుగు రోజుల మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. కాగా రెండు అనధికారిక టెస్టులు ఆడే నిమిత్తం బంగ్లాదేశ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో నవంబరు 29న ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత-ఎ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆకట్టుకున్న బౌలర్లు ఈ నేపథ్యంలో భారత బౌలర్లు సౌరభ్ కుమార్ 4, నవదీప్ సైనీ 3 వికెట్లతో చెలరేగగా.. ముకేశ్ కుమార్ 2, అతిత్ షేత్ ఒక వికెట్ తీశారు. దీంతో ఆతిథ్య బంగ్లా-ఎ జట్టు 112 పరుగులకే కుప్పకూలి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. సెంచరీలతో మెరిసినా ఈ క్రమంలో భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(145), అభిమన్యు ఈశ్వరన్(142) అద్బుత సెంచరీలతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ఉపేంద్ర యాదవ్ 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో 132 ఓవర్ల వద్ద 5 వికెట్ల నష్టానికి భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ ఒక్కడు పట్టుదలగా నిలబడి ఆ తర్వాత బంగ్లా ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్‌ను 21 పరుగులకే సౌరభ్ కుమార్ పెవిలియన్‌కు పంపాడు. అయితే, మరో ఓపెనర్ జకీర్ హసన్ పట్టుదలగా నిలబడి 402 బంతులు ఎదుర్కొని 172 పరుగులు చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ షాంటో 187 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు నష్టపోయిన బంగ్లా జట్టు 341 పరుగులు చేయగలిగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. జకీర్ హసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. భారత్-ఎ వర్సెస్ బంగ్లాదేశ్-ఎ తొలి టెస్టు స్కోర్లు: భారత్- 465/5 డిక్లేర్డ్ బంగ్లాదేశ్- 112 & 341/9 చదవండి: IND Vs BAN: షమీకి గాయం.. అతడి స్థానంలో యంగ్ బౌలర్.. బీసీసీఐ ప్రకటన IND Vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా లిటన్ దాస్ -
కరణ్ అర్జున్ ట్రైలర్ చూశారా?
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కరణ్ అర్జున్. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో డా.సోమేశ్వర రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా నెల 24న దాదాపు 186 థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో ప్రీ రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ..."మహాభారతంలోని కర్ణుడు, అర్జునుడి ఎమోషన్స్ లైన్ తీసుకొని సాంకేతికంగా ఇప్పుడున్న జనరేషన్‌కు తగ్గట్టుగా సినిమా తెరకెక్కించాం. మంచి లొకేషన్స్ కోసం పాకిస్థాన్ బార్డర్లో ఎంతో కష్టపడి షూట్ చేశాము. ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఈ సినిమాలో ఆర్టిస్టులు కొత్తవారని చూడకుండా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వాలని కంటెంట్‌ను నమ్ముకుని చేసిన సినిమా ఇది. నిర్మాతలు ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదట ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో మాత్రమే రిలీజ్ చెయ్యాలనుకున్నాము. కానీ సౌత్‌తో పాటు నార్త్‌లోనూ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు. నిర్మాతల్లో ఒకరైన బాలకృష్ణ ఆకుల మాట్లాడుతూ…'ఈ సినిమా బాగా వచ్చింది. సుకుమార్, అనిల్ రావిపూడి, పరుశురాం తదితరులు మా సినిమాకు సపోర్ట్ చేశారు. వారికి మా ధాన్యవాదాలు. మేము విడుదల చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది" అన్నారు. హీరో నిఖిల్ కుమార్ మాట్లాడుతూ..."ఇది మా నాన్న డ్రీమ్. నన్ను హీరోగా తెరపై చూడాలనుకున్నారు. మా నాన్న అనుకున్నట్లే సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో ఎటువంటి వల్గారిటీ లేకుండా ఫుల్ లవ్ & యాక్షన్ ఉంటుంది. చూసిన ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చుతుంది" అన్నారు. హీరో అభిమన్యు మాట్లాడుతూ.. 'ఆర్టిస్ట్ గా నాకిది మెదటి చిత్రమైనా నటనలో నేను ద బెస్ట్ ఇచ్చాను అనుకుంటున్నా. ఇందులో హీరో, హీరోయిన్స్ ఉన్నా కంటెంటే హీరో' అన్నారు. చదవండి: బయోపిక్, బయోఫిక్షన్ మధ్య తేడా ఉంది: హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరును ప్రపంచానికి చాటుదాం: సీఎం -
మాట తప్పని దేవుడు మా జగనన్న
-
అభిమన్యుడు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను
విశాల్, సమంత జంటగా అర్జున్ ముఖ్య పాత్రల్లో పీయస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇరంబుదురై’. తెలుగులో ‘అభిమన్యుడు’. యం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి. హరి తెలుగులో జూన్ 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా ‘ఇరంబుదురై’ నిలించింది. తమిళంలో సక్సెస్ సాధించినట్టే ఇక్కడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమా ‘అభిమన్యుడు’. తమిళంతో పాటుగా తెలుగులోనూ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. మే 11న చాలా తెలుగు సినిమాలు ఉండటంతో రిలీజ్ చేయలేకపోయాం. ► నా సినిమా జీవితం అర్జున్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా స్టార్ట్ అయింది. ఆయనతో కలిసి యాక్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హీరో విలన్ మధ్య పోటీ చక్కగా కుదిరింది. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో అర్జున్‌గారు పలికే సంభాషణలే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నాయి. ► ‘అభిమన్యుడు’ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆర్మీ వాళ్లకు రేషన్ కార్డ్ ఉండదు. రైతులకు బ్యాంక్ లోన్లు ఇవ్వరు అనే విషయాలు తెలిశాయి. ఇలాంటి విషయాలు సినిమాలో డైలాగుల రూపంలో పెట్టాం. ► అందరూ డిజిటల్ ఇండియా, ఆధార్ కార్డ్ అంటున్నారు. దీని వల్ల ఎలాంటి పరిమాణాలు ఉంటాయి అని ఈ సినిమాలో చూపించాం. డిజిటల్ ఇండియా అవసరమా? అనే ప్రశ్నతో సినిమాను ఎండ్ చేశాం. పార్ట్ 2 కూడా రూపొందిస్తాం. ► టీమ్ అంతా బాగా కుదిరింది. సమంతతో యాక్ట్ చేయడం ఫస్ట్ టైమ్. మంచి కో–స్టార్. కెమెరా జార్జ్ సీ విలియమ్స్, సంగీతం యువన్ శంకర్ రాజా అన్నీ కరెక్ట్‌గా కుదిరాయి. అందరం దర్శకుడిని నమ్మాం. ► సినిమా రిలీజ్‌కు ముందు టెస్ట్ స్క్రీనింగ్ చేశాం. బయటవాళ్ళ అభిప్రాయాలను తీసుకొని నాలుగుసార్లు ఎడిట్ చేశాం. బయటవారి ఒపీనియన్ తీసుకోవడం మంచిదని తెలిసింది. ► క్రైమ్‌కి బలమైన శిక్ష ఉంటే తప్పు చేయాలనే ఆలోచన మానుకుంటారు. సినిమా అనేది స్ట్రాంగ్ మీడియం. సోషల్ అవేర్నెస్ సినిమాలు రూపొందించాలి అని మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ► నెక్ట్స్ ‘టెంపర్’ రీమేక్‌లో యాక్ట్ చేస్తున్నాను. కొత్త స్క్రీన్‌ప్లేతో చేయబోతున్నాం. మురగదాస్ అసిస్టెంట్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. ‘అభిమన్యుడు’ మూవీ రిలీజ్ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మిత్రన్ మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా ఇది నా ఫస్ట్ సినిమా. డిజిటలైజేషన్కి మరో వైపు ఎలా ఉంటుందో అని ఇందులో చూపించాం. సినిమా అనేది స్ట్రాంగ్ మీడియం. పాటనో ఫైట్నో కాకుండా సమాజంలో జరిగే విషయాల్ని ఈ సినిమాలో చూపించాం.పెళ్లైన హీరోయిన్ నటించకూడదు అనే విషయాన్ని దాటి సమంత సక్సెస్ కొట్టారు’’అన్నారు. ‘‘రంగస్థలం, మహానటి’ తర్వాత తమిళంలో ‘ఇరంబుదురై’తో సక్సెస్ అందుకున్నాను. ఇన్ఫర్మేషన్ థెప్ట్ గురించిన అవేర్నెస్ను కలిగిస్తూ కమర్షియల్ పంథాలో రూపొందించాం. తెలుగులోను సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు సమంత. ‘‘ఈ సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రను పోషించాను. చాలా స్టైలిష్‌గా నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కాలానికి టైలర్ మేడ్ మూవీ ఇది. మిత్రన్ ఫస్ట్ సినిమా అయినా చక్కగా తెరకెక్కించారు. అభిమన్యుడు మహాభారతంలో అల్టిమేట్ హీరో. అలాగే అన్సక్సెస్ఫుల్ హీరో. కానీ మా అభిమన్యుడు సక్సెస్ఫుల్ హీరో’’ అన్నారు అర్జున్. ఈ సినిమాకు సంగీతం:యువన్ శంకర్ రాజా. -
నేనెవరికీ భయపడను!: సమంత
తమిళసినిమా: చాలా ధైర్యం గల కథానాయికిల్లో నటి సమంత ఒకరని చెప్పవచ్చు. తనకుంటూ కచ్చితమైన అభిప్రాయాలు కలిగిన ఈ సుందరి తన మనసులోని భావాలను నిర్భయంగా వెల్ల డించగలరు. నట జీవితం, ప్రేమ, పెళ్లి వంటి వ్యక్తిగత జీవితాలను గెలుపు బాటలో సాగించుకుంటున్న అరుదైన నటి సమంత అని చెప్పవచ్చు. సాధారణంగా నటి వివాహనంతరం విజయవంతమైన కథానాయకిగా రాణించడం అరుదే. సమంత దాన్ని సులభంగా బ్రేక్ చేసి వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల తెలుగు చిత్రం రంగస్థలం, ద్విభాషా చిత్రం నడిగైయార్ తిలగం, తమిళ చిత్రం ఇరుంబుతిరై అంటూ వరుస విజయాలను ఎంజాయ్ చేస్తున్న సమంత ముచ్చట్లు చూద్దాం. ప్ర: కోలీవుడ్‌లో విజయ్, సూర్యల తరువాత విశాల్‌తో ఇరుంబుతిరై చిత్రంలో నటించిన అనుభవం గురించి? జ: విశాల్ సెట్లో ఉంటే యమ జాలీనే. అందరినీ ఆయన నవ్విస్తుంటారు. చిత్ర పరిశ్రమ, ప్రజలు బాగుండాలని భావించే వ్యక్తి. ఈ వయసులోనే పెద్ద బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం ఆశ్చర్యమైన విషయం. విశాల్ చాలా ప్రతిభావంతుడు. ప్ర: ప్రస్తుతం నటిస్తున్న విజయ్‌సేతుపతి, శివకార్తి కేయన్ చిత్రాల గురించి? జ: శివకార్తికేయన్, దర్శకుడు పొన్రామ్ల కాంబినేషన్ ఎప్పుడూ చాలా సరదాగా ఉంటుంది. ఒక ఊరు ఇతివృత్తంగా రూపొందిన చిత్రంలో నేనెప్పుడూ నటించలేదు. అలాంటి చిత్రం సీమరాజా. చిత్రం అంతా లంగా ఓణితోనే కనిపిస్తాను. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం కోసం సిలంబాట్టం (కర్రసాము) విద్యను నేర్చుకుని నటించడం మంచి అనుభవం. ఇకపోతే విజయ్‌సేతుపతికి జంటగా త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో నటిస్తున్న సూపర్ డీలక్స్ చిత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుందని చెప్పగలను. కొందరు శివకార్తికేయన్, విజయ్‌సేతుపతిల మధ్య పోటీ అంటుంటారు. నిజానికి అలాంటిదేమీ లేదు. వారు ముందు చిత్రాలతోనే పోటీ పడుతుంటారు. ప్ర: వివాహానంతరం నటించడం గురించి ఎలా భావిస్తున్నారు? జ: వివాహనంతరం విడుదలైన రంగస్థలం ఘన విజయం సాధించిన చిత్రంగా నిలిచింది. పెళ్లి కారణంగా నాకెలాంటి బాధింపు కలగలేదు. మంచి కథా పాత్రలు, చక్కగా నటించే అవకాశం కలిగితే నన్నెవరూ పక్కన పెట్టలేరు. పెళ్లైన నటి అనే ఇమేజ్ను బ్రేక్ చేయడం ఎంత కష్టం అన్నది తెలుసు. అయితే దాన్ని బ్రేక్ చేస్తే చాలదు. వరుసగా పలు విజయవంతమైన చిత్రాలను అందిస్తేనే పెళ్లైయిన నటి కథానాయకిగా రాణించగలనని నిరూపించి భవిష్యత్‌లో వచ్చే నటీమణులకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. ప్ర: పెళ్లి తరువాత సమంతలో మార్చు వచ్చిందా? జ: నిజం చెప్పాలంటే నాకు కోపం ఎక్కువ. పెళ్ళైన తరువాత అది కొంచెం తగ్గించుకున్నాను. వివాహానంతరం షూటింగ్ ముగించుకుని సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వెళ్లిపోతాను. ఇంటిలో సినిమా గురించి మాట్లాడకూదని నాగచైతన్య చెప్పారు. అయితే ఆయనతో గొడవ పడతాను. అయితే మా గొడవలు పక్కనున్న వారికి కూడా తెలియవు. అంత సైలెంట్‌గా జాలీగా గొడవ పడుతుంటాం. అది చూసేవారికి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. వివాహం అయిన నటి కూడా సక్సెస్‌ఫుల్‌గా రాణించవచ్చునని నాగచైతన్య నమ్ముతున్నారు. నటన అన్నది ఒక వృత్తిగానే భావించు అని ఆయన చెప్పడం ఉన్నతమైన ఆలోచన. ప్ర: వివాహానంతరం సామాజిక మాధ్యమాల్లో గ్లామరస్ ఫొటోలను విడుదల చేస్తున్నారనే విమర్శలపై మీ స్పందన? జ: సముద్రతీరంలో ఈత దుస్తుల్లో ఫొటోలను విడుదల చేస్తే నా గురించి కచ్చితంగా విమర్శిస్తారని తెలుసు. అయితే బీచ్‌లో చీరలు ధరించగలమా? నేను వివాహిత నటిననేగా తప్పుగా విమర్శిస్తున్నారు. నా జీవితాన్ని ఎలా గడపాలన్నది ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనెవరికీ భయపడను. ఎలాంటి సమస్యలోనూ చిక్కుకోవాలని కోరుకోవడం లేదు. -
తొలకరి చూసి...
విశాల్, సమంత జంటగా ఎస్.మిత్రన్ డైరెక్షన్లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘ఇరంబుదురై’. హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి ఈ సినిమాను తెలుగులో ‘అభిమన్యుడు’ గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని తొలిపాట ‘తొలి తొలిగా తొలకరి చూసి పిల్లాడ్నై..’ను హీరో నితిన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జి.హరి మాట్లాడుతూ– ‘‘యువన్ శంకర్ రాజా అద్భుతమైన మ్యూజిక్ అందించారు. యాక్షన్ కింగ్ అర్జున్‌తో పాటు భారీ తారగణం ఈ సినిమాలో యాక్ట్ చేశారు. విశాల్ కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. షూటింగ్ పూర్తి అయిపోయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు కెమెరా:జార్జీ సి విలియమ్స్, సహనిర్మాత: ఇ.కె.ప్రకాశ్. -
టైటిల్ ఫైనల్ చేసిన మహేష్ మూవీ టీం..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నా.. ఇంత వరకు టైటిల్, ఫస్ట్ లుక్‌లను రిలీజ్ చేయలేదు. కానీ మహేష్ మూవీ టైటిల్ ఇదేనంటూ చాలా పేర్లు తెరమీదకు వచ్చాయి. ఏజెంట్ శివ, సంభవామి, ఎనిమీ, మర్మం లాంటి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ మూవీ టైటిల్ విషయంలో చిత్రయూనిట్ ఒక నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ కౌంటర్ టెర్రరిజం ఆఫీసర్ అభిమాన్యుగా నటిస్తున్నాడు మహేష్. అందుకే సినిమాలో మహేష్ క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్‌గా పెడితే బెటర్ అని భావిస్తున్నారట. అభిమన్యు అనే టైటిల్ అయితే పవర్‌ఫుల్‌గా ఉంటుందని భావిస్తున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఒకే టైటిల్‌తో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే టైటిల్‌ను ఫైనల్ చేసి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. -
ముఖ్యమంత్రి రేసులో సుష్మాస్వరాజ్!
న్యూఢిల్లీ/చంఢీఘర్: హర్యానాలో బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని స్సష్టమవడంతో ముఖ్యమంత్రి స్థానానికి ఆ పార్టీలో పోటీ మొదలైంది. హర్యానాలో బీజేపీ మొట్టమొదటిసారిగా ఆధికారాన్ని చేపట్టబోతోంది. ఈ రాష్ట్రంలోని మొత్తం 90 శాసనసభ స్థానాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. బీజేపీ దాదాపు 52 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 46 స్థానాలు ఉంటే చాలు. మెజార్టీ స్థానాలను బీజేపీ ఒక్కటే గెలుచుకునే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ మొదలైంది. అయితే ఈ పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు అనేక అంశాలను పార్టీ పరిగణనలోకి తీసుకుంటుంది. ముఖ్యంగా కులానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బీజేపీ సీనియర్ నేత కెప్టెన్ అభిమన్యు పేరు ప్రధానంగా వినవస్తోంది. ఇంకా కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, ఇంద్రజిత్ సింగ్, క్రిషన్ పాల్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాంవిలాస్ శర్మ పేర్లు కూడా వినవస్తున్నాయి. ** -
ఆధిపత్యం భరించలేకే చంపేశాం
యువకుడి హత్య కేసులో నిందితుల వెల్లడి స్నేహితులే హంతకులు నలుగురికి రిమాండు కేసు వివరాలను వెల్లడించిన ఏసీపీ సురేందర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: యువకుడి హత్య మిస్టరీ వీడింది. స్నేహితులే అతడిని చంపేశారు. తరుచూ మద్యం తాగించమని, డబ్బులు ఇవ్వమని బెదిరిస్తూ తమపై ఆధిపత్యం ప్రదర్శించడంతో చంపేశామని నిందితులు పోలీసులకు తెలిపారు. ఏసీపీ సురేందర్‌రెడ్డి శనివారం స్థానిక ఠాణాలో కేసు వివరాలు వెల్లడించారు. నగరంలోని బడంగ్‌పేట మిధాని టౌన్షిప్ సమీపంలోని సుభాష్ చంద్రబోస్ కాలనీకి చెందిన కోయలకొండ అర్జున్ కుమారుడు అభిమన్యు(19) ఐటీఐ చదువుతూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి బాలాపూర్‌కు చెందిన అడ్ల రమేశ్ అలియాస్ రాకి (19), గొట్టిముక్కల రాఘవాచారి అలియాస్ రఘు(19), మెగావత్ లక్ష ్మణ్ నాయక్ (19), వరియోగి సాయితేజ (19), లష్కర్ శివానంద్ అలియాస్ శేఖర్(19), కంసల కిట్టు అలియాస్ కార్తిక్(19) స్నేహితులు. వీరంతా తమ ఆర్థిక అవసరాల కోసం స్థానికంగా పనులు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా అభిమన్యు తరచూ మద్యం తాగించమని, డబ్బులు ఇవ్వమని స్నేహితులను బెదిరిస్తూ వారిపై ఆధిపత్యం ప్రదర్శించేవాడు. ఇది భరించలేని అతడి మిత్రులు ఎలాగైనా అభిమన్యును చంపేయాలని పథకం పన్నారు. ఈక్రమంలో ఈనెల 1న అభిమన్యుతో కలిసి మద్యం తాగారు. అభిమన్యు మత్తులోకి జారుకున్నాక రాత్రి 10 గంటల ప్రాంతంలో బడంగ్పేట్ నుంచి ఆటోలో నాదర్గుల్ మీదుగా ఆదిబట్ల సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డుకు తీసుకెళ్లారు. అక్కడ అంతా కలిసి మళ్లీ మద్యం తాగారు. రమేశ్ కత్తితో అభిమన్యు గొంతు కోశాడు. రాఘవాచారి బండరాళ్లతో మోదాడు. మిగిలిన వాళ్లు అభిమన్యును కదలకుండా పట్టుకున్నారు. అభిమన్యు చనిపోయాడని నిర్ధారించుకున్నాక తమపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు రమేశ్, రాఘవాచారి, సాయిలు కలిసి తిరుపతి వెళ్లారు. మిగతా వారు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మరుసటి రోజు హత్య విషయం బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థ లానికి చేరుకొని వివరాలు సేకరించారు. లభించిన ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ సా యంతో అభిమన్యు స్నేహితులపై నిఘా ఉం చారు. శనివారం ప్రధాన నిందితులు రమేష్, రాఘవాచారి మినహా మిగతా వారు బడంగ్పేట్ చౌరస్తాలో ఉండగా అదుపులోకి తీసుకొ ని విచారించగా నేరం అంగీకరించారని ఏసీపీ తెలిపారు. అనంతరం వారిని రిమాం డుకు త రలించారు. నిందితులపై గతంలో పలు కేసు లు కూడా న మోదయ్యాయని తెలిపారు. -
తెరపై భాగ్యశ్రీ తనయుడు!
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘మైనే ప్యార్ కియా’ హీరోయిన్ భాగ్యశ్రీ తనయుడు అభిమన్యు త్వరలోనే తెరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ‘మైనే ప్యార్ కియా’లో భాగ్యశ్రీకి జంటగా నటించిన సల్మాన్ ఖాన్ త్వరలోనే అభిమన్యును తెరపైకి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. భాగ్యశ్రీ మాత్రం ఈ ఊహాగానాలపై పెదవి విప్పడం లేదు. తగిన సమయం వచ్చినప్పుడు తన కొడుకు తెరంగేట్రం గురించి వివరాలు వెల్లడిస్తానని ఆమె చెబుతోంది. -
12 బస్సుల్ని ధ్వంసం చేసిన విద్యార్థులు
గుర్గావ్: సహవిద్యార్థి బస్సు కిందపడి చనిపోవడంతో ఆగ్రహానికి లోనైన విద్యార్థులు బుధవారం దాదాపు 12 బస్సులను ధ్వంసం చేశారు. వివరాలిలా ఉన్నాయి. సెక్టార్ 14లోని మెహ్రౌలి-గుర్గావ్ మార్గంలోగల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ)లో చదువుతున్న విద్యార్థులు కళాశాల వద్ద బుధవారం హర్యానా రోడ్‌వేస్ సంస్థకు చెందిన బస్సును ఎక్కుతుండగా డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకుపోనిచ్చాడు. దీంతో నర్సింగాపూర్ నివాసి అయిన అభిమన్యు (17) బస్సు వెనకచక్రాల కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో తీవ్రస్థాయిలో ఆగ్రహానికి లోనైన సహవిద్యార్థులు 12 బస్సులను ధ్వంసం చేశారు. పోలీసులు మృతదేహాన్ని పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.