12 బస్సుల్ని ధ్వంసం చేసిన విద్యార్థులు | Gurgaon students vandalise vehicles after student's death | Sakshi
Sakshi News home page

12 బస్సుల్ని ధ్వంసం చేసిన విద్యార్థులు

Published Wed, Dec 11 2013 11:58 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Gurgaon students vandalise vehicles after student's death

గుర్గావ్: సహవిద్యార్థి బస్సు కిందపడి చనిపోవడంతో ఆగ్రహానికి లోనైన విద్యార్థులు బుధవారం దాదాపు 12 బస్సులను ధ్వంసం చేశారు. వివరాలిలా ఉన్నాయి. సెక్టార్ 14లోని మెహ్రౌలి-గుర్గావ్ మార్గంలోగల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)లో చదువుతున్న విద్యార్థులు కళాశాల వద్ద బుధవారం హర్యానా రోడ్‌వేస్ సంస్థకు చెందిన  బస్సును ఎక్కుతుండగా డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకుపోనిచ్చాడు. దీంతో నర్సింగాపూర్ నివాసి అయిన అభిమన్యు (17) బస్సు వెనకచక్రాల కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో తీవ్రస్థాయిలో ఆగ్రహానికి లోనైన సహవిద్యార్థులు 12 బస్సులను ధ్వంసం చేశారు. పోలీసులు మృతదేహాన్ని పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement