రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కరణ్ అర్జున్. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో డా.సోమేశ్వర రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా నెల 24న దాదాపు 186 థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రీ రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ..."మహాభారతంలోని కర్ణుడు, అర్జునుడి ఎమోషన్స్ లైన్ తీసుకొని సాంకేతికంగా ఇప్పుడున్న జనరేషన్‌కు తగ్గట్టుగా సినిమా తెరకెక్కించాం. మంచి లొకేషన్స్ కోసం పాకిస్థాన్ బార్డర్‌లో ఎంతో కష్టపడి షూట్ చేశాము. ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఈ సినిమాలో ఆర్టిస్టులు కొత్తవారని చూడకుండా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వాలని కంటెంట్‌ను నమ్ముకుని చేసిన సినిమా ఇది. నిర్మాతలు ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదట ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో మాత్రమే రిలీజ్ చెయ్యాలనుకున్నాము. కానీ సౌత్‌తో పాటు నార్త్‌లోనూ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన బాలకృష్ణ ఆకుల మాట్లాడుతూ…'ఈ సినిమా బాగా వచ్చింది. సుకుమార్, అనిల్ రావిపూడి, పరుశురాం తదితరులు మా సినిమాకు సపోర్ట్ చేశారు. వారికి మా ధాన్యవాదాలు. మేము విడుదల చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది" అన్నారు. హీరో నిఖిల్ కుమార్ మాట్లాడుతూ..."ఇది మా నాన్న డ్రీమ్. నన్ను హీరోగా తెరపై చూడాలనుకున్నారు. మా నాన్న అనుకున్నట్లే సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో ఎటువంటి వల్గారిటీ లేకుండా ఫుల్ లవ్ & యాక్షన్ ఉంటుంది. చూసిన ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చుతుంది" అన్నారు. హీరో అభిమన్యు మాట్లాడుతూ.. 'ఆర్టిస్ట్ గా నాకిది మెదటి చిత్రమైనా నటనలో నేను ద బెస్ట్ ఇచ్చాను అనుకుంటున్నా. ఇందులో హీరో, హీరోయిన్స్ ఉన్నా కంటెంటే హీరో' అన్నారు.
చదవండి: బయోపిక్, బయోఫిక్షన్ మధ్య తేడా ఉంది: హీరో
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరును ప్రపంచానికి చాటుదాం: సీఎం
Comments
Please login to add a commentAdd a comment