విశాల్, సమంత
విశాల్, సమంత జంటగా ఎస్.మిత్రన్ డైరెక్షన్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఇరంబుదురై’. హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి ఈ సినిమాను తెలుగులో ‘అభిమన్యుడు’ గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని తొలిపాట ‘తొలి తొలిగా తొలకరి చూసి పిల్లాడ్నై..’ను హీరో నితిన్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా జి.హరి మాట్లాడుతూ– ‘‘యువన్ శంకర్ రాజా అద్భుతమైన మ్యూజిక్ అందించారు. యాక్షన్ కింగ్ అర్జున్‌తో పాటు భారీ తారగణం ఈ సినిమాలో యాక్ట్ చేశారు. విశాల్ కెరీర్‌లోనే ఎక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. షూటింగ్ పూర్తి అయిపోయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు కెమెరా:జార్జీ సి విలియమ్స్, సహనిర్మాత: ఇ.కె.ప్రకాశ్.
Comments
Please login to add a commentAdd a comment