లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమిపాలైన భారత జట్టు.. ఇప్పుడు మరో విదేశీ పర్యటనకు సిద్దమైంది. నెలరోజుల విశ్రాంతి తర్వాత టీమిండియా విండీస్ టూర్‌కు వెళ్లనుంది.
ఈ పర్యటనలో టీమిండియా భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూలై 12న డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో టీమిండియా టూర్ ప్రారంభంకానుంది. ఇక ఈ విండీస్ పర్యటనలో పలువురు యువ క్రికెటర్లు భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఛాన్స్ ఉంది. టీమిండియా తరపున ఎంట్రీ ఇచ్చే ఆటగాళ్లపై ఓ లూక్కేద్దం.
యశస్వీ జైశ్వాల్
21 ఏళ్ల యశస్వీ జైశ్వాల్ కరేబియన్ టూర్‌లో భారత తరపున టెస్టు, టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. జైశ్వాల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో జైశ్వాల్ దుమ్మురేపాడు. ఐపీఎల్-2023లో ఓవరాల్‌గా 14 మ్యా్చ్‌లు ఆడిన ఈ యువ ఓపెనర్.. 625 పరుగులు చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు.
ముఖేష్ కుమార్
బెంగాల్‌కు చెందిన ఈ ఎక్స్‌ప్రెస్ పేసర్ టీమిండియా తరపున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. గత కొన్ని టెస్టు సిరీస్‌లకు భారత జట్టుకు ముఖేష్ ఎంపికవతున్నప్పటికీ.. అరంగేట్రం చేసే ఛాన్స్ మాత్రం లభించలేదు. అదే విధంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా రిజర్వ్ బౌలర్‌గా ముఖేష్ ఎంపికయ్యాడు. అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్న ముఖేష్ కుమార్ కచ్చితంగా విండీస్ సిరీస్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
రింకూ సింగ్..
రింకూ సింగ్.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకడిగా పేరొందాడు. ఐపీఎల్-2023లో రింకూ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది కేకేఆర్‌కు సంచలన విజయాన్ని అందించిన రింకూ.. ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. రింకూ విండీస్ పర్యటనలో టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.
సర్ఫరాజ్ ఖాన్
ముంబైకు చెందిన సర్ఫరాజ్ ఖాన్ దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శరన కనబరుస్తున్నాడు. అయినప్పటకీ భారత సెలక్టర్లు అతడిని పట్టించుకోవడవవలేదని గత కొంత కాలంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో విండీస్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ సెలక్టర్లు పిలుపునిచ్చే అవకాశం ఉంది.
చదవండి: రోహిత్ వద్దు.. వారిద్దరిలో ఒకరని టీమిండియా కెప్టెన్ చేయండి: మాజీ సెలక్టర్
Comments
Please login to add a commentAdd a comment