రింకూ సింగ్ (PC: Twitter)
Rinku Singh Highlights Of 40 Off 30 Balls In Duleep Trophy Video: కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలనం రింకూ సింగ్ బీసీసీఐ సెలక్టర్లపై పరోక్షంగా విమర్శలు సంధించాడు. దేశవాళీ క్రికెట్‌లో సిక్సర్లు బాదుతున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. తన ఆటలో ఎలాంటి లోపం లేదని.. మరి తనకెందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది.
కాగా ఐపీఎల్-2023లో రింకూ సింగ్ అద్భుత ఆట తీరు కనబరిచిన విషయం తెలిసిందే. కేకేఆర్ తరఫున బరిలోకి దిగిన ఈ యూపీ బ్యాటర్.. 14 మ్యాచ్‌లలో కలిపి 474 పరుగులు సాధించాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చిన తీరు అభిమానులను ఫిదా చేసింది.
ఫినిషర్‌గా తానున్నానంటూ
కేకేఆర్ స్టార్లంతా విఫలమైన వేళ డెత్ ఓవర్లలో రింకూ చూపిన తెగువ క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో సీజన్ ఆసాంతం ఆకట్టుకున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌కు టీమిండియాలో చోటు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
క్యాష్ రిచ్ లీగ్ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు తొలిసారి ఆడనున్న వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో రింకూ సెలక్టర్ల పిలుపు అందుకుంటాడని అంతా భావించారు. కానీ ఐపీఎల్-2023లో అదరగొట్టిన యశస్వి జైశ్వాల్(రాజస్తాన్ రాయల్స్), తిలక్ వర్మ(ముంబై ఇండియన్స్)కు ఎంపిక చేశారే తప్ప రింకూకు మాత్రం మొండిచేయి చూపారు.
దులిప్ ట్రోఫీలో
ఈ నేపథ్యంలో దులిప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌కు ప్రాతినిథ్యం వహించిన రింకూ సింగ్.. వెస్ట్ జోన్‌తో సెమీ ఫైనల్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 69 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 48 పరుగులు సాధించిన 25 ఏళ్ల ఈ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు రాబట్టాడు.
ఈ మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్‌కు సంబంధించిన హైలైట్స్ వీడియోను రింకూ సింగ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లకు దిమ్మతిరిగేలా బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చావు కదా బ్రో అంటూ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా రింకూకు విండీస్ చోటు దక్కని నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తగా.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: Ind Vs WI: విండీస్‌తో తొలి టెస్టు.. అత్యంత అరుదైన రికార్డు ముంగిట కోహ్లి
రహానే వైస్ కెప్టెన్ అయినపుడు మరి కోహ్లి ఎందుకు..?: మాజీ చీఫ్ సెలక్టర్
Comments
Please login to add a commentAdd a comment